Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిరికిదాన్ని కాదు... తను లేకుండా బతకలేనమ్మా... సారీ మమ్మీ... గీతిక సూసైడ్ నోట్

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థిని గీతిక ఆత్మహత్య చేసుకుంది. ఈమె ఆత్మహత్యకు గల కారణాలు తెలిశాయి. గీతిక ఆత్మహత్య చేసుకునే ముందు ఓ సూ

Webdunia
సోమవారం, 13 ఆగస్టు 2018 (11:48 IST)
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థిని గీతిక ఆత్మహత్య చేసుకుంది. ఈమె ఆత్మహత్యకు గల కారణాలు తెలిశాయి. గీతిక ఆత్మహత్య చేసుకునే ముందు ఓ సూసైడ్ నోట్ రాసిపెట్టి చనిపోయింది. ఈ లేఖలోని అంశాలను పరిశీలిస్తే, ఇంట్లో తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి అంగీకరించక పోవడం వల్లే గీతిక సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
 
వైద్య విద్యార్థిని గీతిక ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తల్లికి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇందులో భాగంగా గీతిక, తన తల్లి హరితా దేవికి ఇటీవల ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఈ ప్రేమ పెళ్లికి ఇంట్లోవారు అంగీకరించలేదు. ఈ కారణంగా వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 
 
దీంతో మనస్తాపం చెందిన గీతిక, పెళ్లికి తల్లి ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించి బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయే ముందు సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. తాను పిరికి దానిని కాదని.. తప్పని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో తెలిపింది. 
 
ప్రేమించిన మనిషితో పెళ్లి జరగకుండా ఉండలేనని, జీవితంలో ఓడిపోతానని ఎప్పుడూ అనుకోలేదని, తనను క్షమించాలని పేర్కొంది. అయితే చదువులో వత్తిడి వల్లే తన కుమార్తె గీతిక ఆత్మహత్య చేసుకుందని, మరే ఇతర కారణాలు లేవని ఆమె తల్లి హరితా దేవి వాదించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments