Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tirupati Girl Reels At Alipiri మోడ్రన్ దుస్తుల్లో కిస్సిక్ పాటకు రీల్.. సారీ చెప్పిన యువతి

ఠాగూర్
బుధవారం, 4 డిశెంబరు 2024 (22:47 IST)
Tirupati Girl Says Apology For Doing Reels At Alipiri ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళే అలిపిరి మార్గంలో ఓ యువతి రీల్ చేసింది. అల్లు అర్జున్ నటించిన "పుష్ప-2" చిత్రంలోని కిస్సిక్ పాటకు ఆమె తన స్నేహితుడుతో కలిసి డ్యాన్స్ చేస్తూ రీల్ చేసింది. దీన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ఇది వైరల్ కావడంతో తీవ్ర విమర్శలకు దిగివచ్చింది. 
 
అలిపిరి టోల్ గేట్ ముందు డ్యాన్స్ చేయడమేమిటని విమర్శలు వచ్చాయి. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని భక్తులు టీటీడీ కోరారు. భక్తులు నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో టీటీడీ విజిలెన్స్ విభాగం ఆ యువతిపై కేసు నమోదు చేసింది. 
 
దీంతో ఆ యువతి దిగివచ్చి క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేసింది. ఏదో తెలిసో.. తెలియకో తప్పు చేశానని, ఏదో అక్కడే క్లైమేట్ బాగుందని, ఆ రీల్ కూడా ట్రెండింగ్‌లో ఉంది కదా అని అనుకోకుండా అక్కడ డ్యాన్స్ చేసినట్టు చెప్పుకొచ్చింది. మరోసారి ఇలాంటి తప్పు చేయనని తెలిపింది. దయచేసి తన తప్పును ఈసారికి క్షమించాలి, ఇంకెపుడూ ఇలా చేయనని తెలిపింది. తను చూసి అలా చేయాలని ఎవరైనా భావిస్తే అలాంటి తప్పులు చేయొద్దని విజ్ఞప్తి చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments