చంద్రబాబు గారిని ఎపుడైనా కలిసే అవకాశం తనకు వస్తే తనను క్షమించమని ఆయనను కోరుతానంటూ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె మాట్లాడుతూ... '' మహిళా కమిషన్ చైర్మన్ పదవిలో వుండి చంద్రబాబును తిట్టమంటే తిట్టను అని చెప్పాను. ఆ పదవి నుంచి తప్పిస్తే రాజకీయ విమర్శలు చేస్తాను అని చెప్పాను. చంద్రబాబును తిట్టడంలేదని అందరూ నన్ను చూసారు. దాంతో వైసిపిలో నాకు ఒకింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.
చంద్రబాబు గారిని బాధపెట్టిన ఇష్యూలో నేను కూడా ఓ కారణమయ్యాను. ఆయన జీవితంలో బాధ పెట్టిన సంఘటనలు వుంటే చాలా పెద్దదని నేను భావిస్తున్నాను. ఆయన వసురీత్యా, రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడిగా ఆయనను అలా ఇబ్బంది పెట్టి వుండాల్సింది కాదు. అలాంటి చర్యలో నేను కూడా కారణమైనందుకు బాధపడుతున్నా.
ఎప్పుడైనా చంద్రబాబు గారిని కలిసే అవకాశం వస్తే క్షమాపణ అడుగుతా'' అంటూ చెప్పారు.