Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్సార్‌కి నేనంటే ప్రాణం, అమ్మపైనే కేసు పెట్టి జగన్ దిగజారిపోయారు: షర్మిల

Advertiesment
Sharmila

సెల్వి

, శుక్రవారం, 25 అక్టోబరు 2024 (14:13 IST)
Sharmila
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ బహిరంగ లేఖ ద్వారా వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిని ఎండగట్టారు. మూడు పేజీల ఈ బహిరంగ లేఖలో సాక్షి మీడియాపై షర్మిల దుమ్మెత్తిపోశారు. "ఈరోజు పొద్దున సాక్షి పేపర్ చూశాను. సాక్షి మీడియా జగన్ మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది. కాబట్టి ఏదైనా నమ్మించగలడు. అయినా వైఎస్సార్ అభిమానులకు అసలు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం నాది" అని తెలిపారు. 
 
అమ్మ వైఎస్ విజయమ్మ గారు, నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఒక పుస్తకం రాశారు. అందులో నాన్న గురించి ప్రత్యేకంగా ఒక మాట రాశారు. "రాజశేఖర్ రెడ్డి గారికి లోకం అంతా ఒకెత్తయితే, తన బిడ్డ షర్మిల ఒకెత్తు" అని రాశారని వెల్లడించారు. 
Open Letter
 
అలాగే నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ కూడా సమానమని షర్మిల తెలిపారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే. అవి జగన్ మోహన్ రెడ్డి గారి సొంతం కాదని తెలిపారు. ఉన్న అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ గారు గార్డియన్ మాత్రమే. 
 
అన్నీ వ్యాపారాలు నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచి పెట్టలనేది జగన్ మోహన్ రెడ్డి గారి భాధ్యత. ఇది రాజశేఖర్ రెడ్డి గారి మేండేట్. వైఎస్ఆర్ ఈ ఉద్దేశ్యాన్ని ఆయన బిడ్డలమైన మాకు, ఆయన భార్యకు, సన్నిహితులందరికి, స్పష్టంగా తెలిసిన విషయం అన్నారు. 
Open Letter
 
తండ్రి ఆదేశాలను, అభిమతాన్ని గారికి వదిలేసారని ఆ లేఖలో అసహనం వ్యక్తం చేశారు. జగన్ నైతికంగా దిగజారిపోయారని తన పైన తల్లి విజయమ్మ పైన కేసు పెట్టి అధః పాతాళానికి కూరుకుపోయారని వైయస్ షర్మిల విమర్శించారు. 
 
ఇప్పటికైనా తండ్రికి ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకుంటారని, మనమధ్య కుదిరిన ఒప్పందానికి కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నానని షర్మిల ఆ లేఖలో పేర్కొన్నారు. సొంత తల్లి పైన కూడా కేసు పెట్టే స్థాయికి మీరు దిగజారారని షర్మిల విమర్శించారు. 
 
మీరు రాసిన లేఖ చట్టప్రకారం ఒప్పందానికి విరుద్ధంగా ఉందని, అంతేకాదు మీరు లేఖ రాయడం వెనుక దురుద్దేశం నన్ను చాలా బాధించిందని షర్మిల లేఖలో పేర్కొన్నారు. ఇక తన రాజకీయ జీవితం తనదని, నా వృత్తిపరమైన వ్యవహార శైలి ఎలా ఉండాలో చెప్పే అధికారం మీకు లేదని షర్మిల తేల్చి చెప్పారు. 
Open Letter
 
ఇక సరస్వతి పవర్ లోని షేర్లు ఎంవోయూలో నా వాటాగా పేర్కొన్న వాటిపై సంతకం చేసిన వెంటనే నాకు బదలాయిస్తానని హామీ ఇచ్చారని, ఒప్పందం జరిగి సంవత్సరాలు గడిచినా ఆ హామీ నెరవేరలేదని మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతి నిర్మాణ పనుల కోసం 15 రోజుల్లో టెండర్లు : మంత్రి నారాయణ