Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో దారుణం : సోదరిపై అన్న అత్యాచారం... ఐదు నెలల గర్భం

Webdunia
ఆదివారం, 4 జులై 2021 (12:43 IST)
తిరుపతిలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. వరుసకు చెల్లెలైన బాలికను బెదిరించి ఓ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం రాత్రి తిరుపతిలో వెలుగు చూసింది. బాలిక గర్భవతి కావడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. 
 
తిరుపతి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి చంద్రగిరి మండలానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. కొడుకు పుట్టిన కొన్నాళ్లకే ఆ మహిళ భర్త నుంచి విడిపోయింది. మరొకరిని వివాహం చేసుకుని కుమారుడితో పాటు తిరుపతిలోని వడమాలపేటలో నివాసముంటోంది. 
 
అయితే, మొదటి భార్యతో విడిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఆమె చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు పుట్టారు. ఈ ఇద్దరిలో రెండో కుమార్తె వయస్సు 14 సంవత్సరాలు. 
 
అయితే, మొదటి భార్య కుమారుడు(16) అప్పుడప్పుడూ తిరుపతిలోని తన తండ్రి, చిన్నమ్మ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఐదు నెలలక్రితం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో తన చెల్లెలైన పధ్నాలుగేళ్ల బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు. 
 
ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. అతడి బెదిరింపులకు భయపడిన ఆ బాలిక ఈ విషయాలను తల్లిదండ్రులకు చెప్పలేదు. ఈ క్రమంలో బాలిక గర్భవతి అయింది. 
 
ఆమె శరీరంలో కలుగుతున్న మార్పులను గుర్తించిన బాలిక తల్లి ఆమెను ప్రశ్నించగా... అసలు విషయాన్ని బయటపెట్టింది. దీంతో ఆమె తల్లి చైల్డ్‌కేర్‌ ప్రతినిధులకు విషయాన్ని తెలియజేయడంతో వారు అలిపిరి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు పోక్సో చట్టంకింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం