Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసిన టీటీడీ

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (16:27 IST)
సెప్టెంబర్ నెల కోటా ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ అధికారులు భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. టికెట్లను పొందిన వారి జాబితాను కూడా విడుదల చేయనున్నారు. 
 
29వ తేదీ ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటల తరువాత తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని స్పష్టం చేశారు. మొత్తం 46,470 టికెట్లను విడుదల చేశారు. ఇందులో లక్కీడిప్‌ ద్వారా భక్తులను ఎంపిక చేయడానికి 8,070 టికెట్లు కేటాయించారు.
 
దీనితో పాటు- ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన 38,400 టికెట్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానంలో సుప్రభాతం, తోమాలసేవ, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్లు అందుబాటులో ఉన్నాయి. 
 
ఏ సేవకు ఎన్ని లక్కీడిప్‌ టికెట్లను కేటాయించారనే జాబితా వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. టికెట్ల అలాట్‌మెంట్ వివరాలను భక్తులకు ఎస్‌ఎంఎస్‌, ఇమెయిల్‌ ద్వారా తెలియజేస్తారు. టికెట్లు పొందిన భక్తులు రెండు రోజుల్లోగా వాటి ధరనను చెల్లించాల్సి ఉంటుంది. 
 
కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల టికెట్లను ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు విడుదలవుతాయని తెలిపారు. 
 
వీటిని ముందుగా వచ్చిన ముందు అనే ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తామని అన్నారు. భక్తులు తమ సేవా టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు ఈ మార్గదర్శకాలను గమనించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతుందా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments