Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో భక్తులకు కరోనావైరస్ రాదు, ఎలా సాధ్యం?

Webdunia
బుధవారం, 8 జులై 2020 (17:35 IST)
టిటిడి క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తులకు వ్యాధి కార‌క క్రిముల నుండి ఎలాంటి హాని క‌లుగ‌కుండా నిర్మూలించేందుకు ట్రై ఓజోన్ స్ప్రేయింగ్ సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేశారు. స్వామివారి ఆల‌యంలోనికి ప్ర‌వేశించే రెండు మార్గాల‌లో ఏర్పాటు చేశారు.
 
శ్రీ‌వారి ఆల‌య మ‌హాద్వారం ముందు భ‌క్తులు ప్ర‌వేశించే స్కానింగ్ సెంట‌ర్ వ‌ద్ద‌, విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న అర్చ‌కులు, ఉద్యోగులు ప్ర‌వేశించే బ‌యో మెట్రిక్ వ‌ద్ద ట్రై ఓజోన్ పొగ‌మంచు రూపంలో స్ప్రేయింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. 
 
ఇందులోని హైడ్రాక్సిల్ ఫ్రి ర్యాడిక‌ల్ ఐయాన్ స్ప్రేయింగ్ చేయ‌డం వ‌ల‌న వ్యాధికార‌క సూక్ష్మ‌క్రిములు న‌శిస్తాయి. త‌ద్వారా భ‌క్తులు, ఉద్యోగులు, అర్చ‌కులు అనారోగ్యకార‌క క్రిముల నుండి ఉప‌శ‌‌మ‌నం పొంద‌వ‌చ్చు. టిటిడి ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణకు విస్తృత చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందులో భాగంగా ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తులు మాస్కులు త‌ప్ప‌నిస‌రిగా ధ‌‌రించాల‌ని, చేతులు శుభ్రం చేసుకు‌ని‌, భౌతిక దూరం పాటిస్తూ నిర్ణీత సంఖ్య‌లో శ్రీ‌వారిని ద‌ర్శించుకునేలా ఏర్పాట్లు చేసింది.
 
అలిపిరి వ‌ద్ద భ‌క్తుల‌కు, ఉద్యోగ‌స్తుల‌కు థ‌ర్మ‌ల్ స్కా‌నింగ్, క‌రోనా ప‌రీక్ష‌ల‌కు శాంపుల్స్ తీసుకుంటున్నారు. టిటిడి ఆరోగ్య విభాగం ఆధ్వ‌ర్యంలో నిర్ణీత స‌మ‌యంలో క్యూలైన్లు, ఆల‌యంలోని అన్ని ఉప‌రిత‌లాల్లో సేంద్రీయ సూక్ష్మక్రిమి నిర్మూల‌న కార‌కాల‌తో నిరంత‌రం శుభ్రం చేస్తున్నారు. 
 
అదేవిధంగా తిరుమ‌ల‌లోని ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో, ర‌ద్దీ ప్రాంతాల‌లో, వ‌స‌తి స‌ముదాయాలు, విశ్రాంతి భ‌వ‌నాలు, క‌ల్యాణ‌క‌ట్ట‌, అన్న ప్ర‌సాద భ‌వ‌నం వ‌ద్ద‌ ఎప్ప‌టిక‌ప్పుడు శానిటైజ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల భక్తులు కరోనా బారిన పడకుండా ఉంటారని టిటిడి ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments