Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం సుప్రీం చెంతకు చేరింది.. 26న విచారణ

ఠాగూర్
మంగళవారం, 23 సెప్టెంబరు 2025 (09:02 IST)
పరమ పవిత్రంగా భావించే తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారం ఇపుడు సుప్రీంకోర్టు చెంతకు చేరింది. ఈ వ్యవహరంపై ప్రత్యేక దర్యాప్తు అధికారి నియామకం చెల్లదని హైకోర్టు పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. అయితే, ఈ పిటిషన్‌‍పై పూర్తి స్థాయి విచారణ ఈ నల 26వ తేదీన జరుగనుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరుపుతోంది. ఈ బృందంలోని దర్యాప్తు అధికారి వెంకట్రావు, విచారణలో భాగంగా చిన్నప్పన్న అనే వ్యక్తికి నోటీసులు జారీ చేశారు. అయితే, ఆ నోటీసులను సవాల్ చేస్తూ చిన్నప్పన్న హైకోర్టును ఆశ్రయించారు. 
 
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, సిట్‌లో వెంకట్రావు నియామకం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని పేర్కొంది. అందువల్ల, ఆయన దర్యాప్తును కొనసాగించరాదని ఆదేశాలు జారీ చేసింది.
 
హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సీబీఐ డైరెక్టర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, ఈ కేసు విచారణను వాయిదా వేయాలని కోరారు. తమ వాదనలు వినిపించేందుకు ఈ నెల 26న అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
 
ఈ అభ్యర్థనను అంగీకరించిన ధర్మాసనం, కేసును ఈ నెల 26న విచారణ జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తుందా? లేక కొట్టివేస్తుందా? అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెద్దన్నయ్య ఓ ఫైటర్.. ఆయనకు రిటైర్మెంట్ లేదు : పవన్ కళ్యాణ్

Kantara Chapter 1: రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన రిషబ్ శెట్టి కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ (video)

Mardaani 3: నవరాత్రి ఆరంభం సందర్భంగా రాణి ముఖర్జీ మర్దానీ 3 పోస్టర్ విడుదల

అనకొండ తిరిగి వచ్చేసింది: పాల్ రుడ్, జాక్ బ్లాక్‌లతో నవ్వులు, యాక్షన్, థ్రిల్స్ పక్కా

ఓజీ చిత్రానికి సహకరించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు: డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments