Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను గర్భవతి చేసి... మరదలిని లాడ్జీకి తీసుకెళ్లిన బావ... చివరకు...

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (08:42 IST)
కట్టుకున్న భార్య గర్భందాల్చడంతో ఆమె మరదలిపై ఓ కామాంధుడు కన్నేశాడు. ఆమెను తన మాయ మాటలతో లొంగదీసుకున్నాడు. ఆమెతో గడిపేందుకు లాడ్జీకి తీసుకెళ్లాడు. అక్కడుక వెళ్ళాక గానీ మరదలికి జ్ఞానోదయం కాలేదు. తన అక్కకు అన్యాయం చేసి తనను లోబరుచుకున్నాడన్న విషయం. 
 
అక్కకు అన్యాయం చేయలేనని చెబుతూ బుధవారం రాత్రి ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించగా, అతడు అదే గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తిరుపతిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌ చందానగర్ పాపిరెడ్డి కాలనీకి చెందిన సాయి నవీన్ (26) నాలుగేళ్ల క్రితం కూకట్‌పల్లి జేఎన్‌టీయూకి చెందిన మహిళను పెళ్లాడాడు. వీరికి ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆమె గర్భంతో ఉంది. అయితే, నవీన్ దంపతుల మధ్య ఏడాదికాలంగా గొడవలు జరుగుతున్నాయి.
 
ఈ నేపథ్యంలో భార్య చెల్లెలి (మరదలు)తో నవీన్ ప్రేమ మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిసిన భార్య తమ కుటుంబ సభ్యుల సొంతూరైన గుడివాడకు వెళ్లింది. దీంతో ఆత్మహత్య చేసుకుంటానని నవీన్ బెదిరించడంతో అందరూ కలిసి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 
మరోవైపు, మరదలితో కలిసి మూడు రోజుల క్రితం నవీన్ తిరుపతి వెళ్లాడు. స్థానికంగా ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. అయితే, అక్కకు అన్యాయం చేసి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటూ ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. 
 
మరోవైపు, సాయి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం ఆమెకు మెలకువ రావడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం