Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో షెడ్యూల్డ్‌ కులాలకు మూడు కార్పొరేషన్‌లు

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (07:59 IST)
షెడ్యూల్డ్‌ కులాల వారికి మూడు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఆంధ్రప్రదేశ్‌ మాల సంక్షేమ కార్పొరేషన్‌’, ‘ఆంధ్రప్రదేశ్‌ మాదిగ సంక్షేమ కార్పొరేషన్‌’, ‘ఆంధ్రప్రదేశ్‌ రెల్లి మరియు ఇతరుల సంక్షేమ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ను ఏర్పాటు చేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
 
వైఎస్సార్‌సీపీ ఎన్నికలకు ముందు పలువురు షెడ్యూల్డ్‌ కులాల వారు చేసిన విజ్ఞప్తి మేరకు స్పందించి కులాల వారీగా ప్రత్యేక కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

ఈ హామీ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జగన్‌ ఎస్సీ కో ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎండీకి మూడు కార్పొరేషన్‌లకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. కాగా  బీసీల్లో 139 కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments