Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగలకు దొంగ అంటే వీడే.. డిఎస్పీ జేబుకే కన్నం వేసిండు.. 90 వేలు కొట్టేసిండు

కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని పెద్దలంటుంటారు. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవద్దు, పెద్ద లక్ష్యాలు ఎంచుకుంటే జీవితం సార్థకం అవుతుందన్నది ఈ నానుడి సారాంశం. కానీ ఒక దొంగ దీన్ని అన్వయించుకుని, థూ..దీన... బతుకు ఎంతకాలం సన్నా పన్నా వాళ్ల జేబులు కొట

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (07:18 IST)
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని పెద్దలంటుంటారు. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవద్దు, పెద్ద లక్ష్యాలు ఎంచుకుంటే జీవితం సార్థకం అవుతుందన్నది ఈ నానుడి సారాంశం. కానీ ఒక దొంగ దీన్ని అన్వయించుకుని, థూ..దీన... బతుకు ఎంతకాలం సన్నా పన్నా వాళ్ల జేబులు కొట్టడమేనా.. పోలీసు బాస్ జేబు కొడితే కదా అసలు కిక్కు వచ్చేది అనుకున్నాడు.

వెంటనే దాన్ని అమలు చేసేశాడు కూడా. నేరుగా పెళ్లి పందరిలోకి వెళ్లి అక్కడ బందోబస్తులో  ఉన్న డీఎస్పీ సాబ్  జేబుకే గాలం వేశాడు. నిజంగానే పెద్ద చేపనే పట్టినట్లుంది..సారు జేబులో 90 వేలు దొరికాయట. కాజేసి చక్కగా తన దారిన తాను వెళ్లిపోయాడు. తర్వాత ఎప్పుడో చూసుకున్న పెద్దసారు వారు తన జేబునే కొట్టేశారంటూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
 
ఎవరైనా తమ సొత్తును పోగొట్టుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. అదే ఒక పోలీస్‌ అధికారి జేబును కొట్టేస్తే.. విశాఖలోని ఒక డీఎస్పీకి సరిగ్గా అలాంటి అనుభవమే ఎదురైంది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కుమార్తె శ్రావ్య వివాహం బుధవారం రాత్రి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో జరిగింది. 
 
సీఐడీ డీఎస్పీ ఎస్‌.భూషణ్‌నాయుడు నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు రాత్రి 9.30కి వేదిక వద్దకు వెళ్లారు. ఆ సమయంలో జనం ఒక్కసారిగా ముందుకు రావడంతో వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు భూషణ్‌నాయుడి జేబులోని రూ.90 వేల నగదును తస్కరించారు. నగదు చోరీకి గురైనట్లు కొంతసేపటి తర్వాత గుర్తించిన ఆయన త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదుచేశారు. 
 
పెద్దసారుకే కన్నం వేసిన కొంటె దొంగ అంటూ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments