Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగసంఘాల నేతలు కొత్తగా పొందే అవమానాలేం ఉండవు: పరుచూరి అశోక్ బాబు

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (18:04 IST)
రాష్ట్రంలో ఉద్యోగస్తులు, ప్రభుత్వం మధ్య జరుగుతున్న సంఘటనలు దేశంలో ఇంతవరకూ ఎక్కడా జరగలేదని, ఉద్యోగుల డిమాండ్లపై ఏ ప్రభుత్వమూ ఇంతలా అలసత్వం, నిరాదరణ చూపినదాఖలాలు కూడా ఎక్కడాలేవని, ఉద్యోగసం ఘాలు వాటి బాధ్యతను విస్మరించి రాజకీయ మైలేజ్ కోసం పాకులాడుతున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు స్పష్టంచేశారు. శనివారం  ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! 
 
ఉద్యోగులు, సంఘాలు ప్రభుత్వాన్ని బతిమాలి బామాలుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉద్యోగుల సమస్యలు కొన్ని కిందిస్థాయిలోనే పరిష్కారమైతే, మరికొ న్ని ముఖ్యమంత్రి స్థాయివరకు వెళుతుంటాయి. పీఆర్సీ నివేదిక ఇచ్చి, ఉద్యోగ సంఘాలు మాకివి కావాలని అడిగే పరిస్థితి లేకుండా ప్రభుత్వం ఎందుకు చేస్తోం ది? పీఆర్సీ నివేదిక ఇవ్వడానికే ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు?

మూడుడీఏలు మూడేళ్లపాటు మంజూరుచేస్తామని చెప్పిన ప్రభుత్వం, పీఆర్సీపై కూడా పలానాసమయంలో స్పందిస్తామని ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోతోంది?  ఫిట్ మెంట్, ఇతరవాటిపై తామ  నిర్ణయం తీసుకోలేమని, కొంత సమయం కావాలని అడిగడానికి ప్రభుత్వం ఎందుకు సంకోచిస్తోంది?  ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఉద్యోగ సంఘాలనేతలు వాస్తవాలు చెప్పకుండా ఎందుకు సన్నాయినొక్కులు  నొక్కుతున్నారు?

ఉద్యోగసంఘం నేత ఒకాయన ఉద్యోగులెవరూ ఇప్పుడు ధర్నాలుచేసే స్థితిలో లేరంటున్నారు. ఉద్యోగులు వారిహక్కులకోసం రోడ్లపైకి రావడానికి సిద్ధంగా లేరని ఆయన అభిప్రాయ మా? ప్రభుత్వం ఉద్యోగసంఘాలనేతలను ఏమైనా చేస్తుందని వారు భయపడు తున్నారా? వారిపై రాజకీయకక్షసాధింపులు ఉంటాయని వారు జంకుతున్నారా?

ఉద్యోగసంఘాలనేతలు, పీఆర్సీ నివేదిక ఇచ్చాకే జాయంట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్ చేయలేకపోతు న్నారు?  గతంలో తెలంగాణ, ఆంధ్రా ఉద్యోగులు పీఆర్సీ విషయంలో కలిసి పోరాడి, అనుకున్నది సాధించారు. 

పోరాడకుండా ఉద్యోగసంఘాలు చర్చలుజరిపితే ఫలితం ఉండదని తమ అభిప్రాయం. ఉద్యోగులు ఏదోఒకకార్యక్రమానికి పిలుపునివ్వకపోతే, ప్రభుత్వం ఎందుకు స్పందిస్తుంది. ఉద్యోగసంఘాలనేతలు ప్రభుత్వానికి జీహూజూర్ అనబట్టే, పాలకు లు ఉద్యోగుల డిమాండ్లపై స్పందించడంలేదు. తెల్లవారుజామున నాలుగ్గంటల వరకు ఉద్యోగసంఘాలనేతలు పడిగాపులు పడటం ఏమిటి? 
 
చంద్రబాబునాయుడు గతంలో ఉద్యోగులకు 43శాతం ఫిట్ మెంట్ ఇస్తే, ఈ ప్రభుత్వం ఐఆర్ ను 27శాతంనుంచి పెంచాలా తగ్గించాలా అని ఆలోచిస్తోంది. 2018 నుంచి ఇవ్వాల్సిన డీఏల్లో ఒకడీఏ వచ్చే ఏడాది మార్చికి ఉద్యోగులకు అందుతుంది. 

01-07-2019 తరువాతినుంచి 6డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. రిటైర్ మెంట్ బెనిఫిట్స్, జీపీఎఫ్ అడ్వాన్స్ ల గురించినఆలోచనే ప్రభుత్వం చేయడంలేదు. ఉద్యోగులతాలూకా జీపీఎఫ్ సొమ్ముని, వారికి తెలియకుండానే ప్రభుత్వం దుర్వినియోగంచేస్తోంది. ఇంతదుర్మార్గమైన చర్యలు ఈ రాష్ట్రంలో తప్ప ఎక్కడా లేవు. ప్రభుత్వం నేరం చేసినప్పుడు ఎవరిని  శిక్షించాలి?

ప్రభుత్వాన్ని నడిపే అధికారులు, అసలు రథసారథి అయిన ముఖ్యమంత్రినే నిలదీయాలి. ఆర్థికమంత్రికి అసలు ఈ వ్యవహారాలు పట్టడంలేదు. నెలలో 30రోజులు ఆయన ఢిల్లీలోనే ఉంటూ, అప్పులకోసం తిరుగుతున్నారు. ఆర్థికశాఖకార్యదర్శి పాత్ర నామమాత్రమే అయింది.

ఈ విధంగా ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై ప్రభుత్వం తాత్సారంచేస్తుంటే, ఉద్యోగసంఘాలు అల్టిమేటం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాయి. దానివల్ల ప్రభుత్వం ఉధ్యోగసంఘాల అలసత్వాన్ని వాడుకొని పబ్బంగడుపుకుంటోంది. దానివల్ల అంతిమంగా సామాన్యఉద్యోగులే తీవ్రంగా నష్టపోతున్నారు.

ఇల్లుకట్టుకోవడానికి రుణాలు పొందాలన్నా, వైద్యసౌకర్యాలు పొందాలన్నా, ఇతరత్రా ప్రయోజనాలు పొందాలన్నా ఉద్యోగులకు అవకాశం లేకుండా పోయింది. ఉపాధ్యాయసంఘాల తరుపున 8, 9 మంది ఎమ్మెల్సీలు ఉన్నా రు. కానీ వారు కూడా స్పందించడంలేదు.

పోరాడకుండా ప్రభుత్వమోచేతినీళ్లు తాగాలనే ఉద్యోగసంఘాల మనస్తత్వంతో అంతిమంగా నష్టపోతున్నది కిందిస్థాయి ఉద్యోగులే. ఉద్యోగులు నేడుపడుతున్న బాధను కచ్చితంగా గుర్తుంచుకుంటారు. సమయం వచ్చినప్పుడు ఎలా చేయాలో, ఏంచేయాలో వారికి బాగా తెలుసని ప్రభుత్వం గుర్తిస్తేమంచిది. ప్రభుత్వం ముందు పీఆర్సీ నివేదికఇచ్చి, పలానా సమయంనుంచీ అమలు చేస్తా మనిచెప్పి, ఉద్యోగులను ఒప్పించుకోవాలి.

ఉద్యోగుల సంక్షేమం గురించే ఆలోచిం చని ప్రభుత్వం, ప్రజలనుఉద్ధరిస్తుందా? గతప్రభుత్వంలో నాకు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు రకరకాలుగా మాట్లాడారు. నేనేమీ ఉద్యోగుల డిమాండ్లను తాకట్టు పెట్టి పదవి పొందలేదు. చంద్రబాబునాయుడి ప్రభుత్వం ఉద్యోగులకు ఎంత చేయాలో అంతాచేసింది. ఆనాడు స్పందించిన సంఘనేతలు, ఇప్పుడెందుకు మాట్లాడటంలేదు?

ఉద్యోగసంఘనేతల చర్యలు కిందిస్థాయివారికే తీరని నష్టం కలిగిస్తాయి. ఉద్యోగుల సంక్షేమంకోసం పోరాడిఓడినా ఉద్యోగసంఘాలనేతలకు వచ్చేనష్టమేమీ లేదు. ఇప్పుడుజరిగినఅవమానంకంటే, ఉద్యోగసంఘాల నేతలు ఇకముందు కొత్తగా పొందే అవమానాలు ఏమీఉండవు. ఉద్యోగసంఘాల నేతలు పోరాడకుండా బానిసల్లా ఉంటే, ఉద్యోగులు క్షమించరు.

ముఖ్యమంత్రి స్థాయిలో ఉద్యోగులసమస్యలపై చర్చించడానికి ఎంత సమయం పడుతుంది? పీఆర్సీ కాపీ ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకింత రచ్చచేస్తోంది? పీఆర్సీ నివేదిక లేకుండా, నెలా ఖరువరకు సమయం తీసుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments