గ్రామాల్లో 'బెల్టు' తీయాల్సిందే: సీఎం

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (06:19 IST)
ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామాల్లో బెల్టు షాపులు ఉండకూడదని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం మహిళా పోలీసులను వినియోగించుకోవాలని సూచించారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎన్​ఫోర్స్​మెంట్, ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఎక్కడా ఇసుక అక్రమ రవాణా, మద్యం అక్రమ తయారీ ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.

ఎన్​ఫోర్స్​మెంట్, ప్రొహిబిషన్, ఎక్సైజ్​శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి, సీఎస్ నీలం సాహ్ని పాల్గొన్నారు. గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్టుషాపులు నడవకూడదని సీఎం నిర్దేశించారు. ఎలాంటి సందర్బంలోనూ ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరగకూడదన్నారు.

ఈ విషయంలో పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళా శక్తిని వినియోగించండి గ్రామాల్లో ప్రభుత్వ ప్రతిష్ఠ పెరగాలంటే బెల్టుషాపులు ఉండకూడదని సీఎం ఉద్ఘాటించారు.

గ్రామాల్లో 11 వేలకుపైగా మహిళా పోలీసులు ఉన్నారని.. వీరి సహకారంతో అక్రమ మద్యం అరికట్టాలని సూచించారు. బెల్టుషాపుల నిరోధం మహిళా పోలీసుల ప్రాథమిక విధి అని చెప్పారు.

ఎన్‌ఫోర్స్​మెంట్‌ విభాగంలో సిబ్బందిని పెంచాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖలో ఉన్న మూడింట రెండు వంతుల సిబ్బందిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పనుల కోసం వినియోగించాలన్నారు.

స్టాండర్ట్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ను తయారుచేసుకోవడం ద్వారా విధి నిర్వహణలో సమర్థతను పెంచుకుని అనుకున్న లక్ష్యాలను సాధించాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments