Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి కోసం కాబోయే భర్తను చంపేసింది

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (18:36 IST)
తన క్లాస్‌మేట్‌ను గాఢంగా ప్రేమించింది. అతనికి సర్వస్వం అర్పించింది. అతడినే పెళ్ళి చేసుకోవాలనుకుంది. కానీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు సరికదా తమ బంధువుతోనే వివాహానికి నిశ్చయించారు. ప్రియుడి లేని జీవితం వద్దనుకుంది. కానీ తను చావడం కన్నా తనకు కాబోయే భర్తనే చంపేస్తే తన ప్రియుడితో తను వుండొచ్చని స్కెచ్ వేసి మరీ దారుణంగా చంపేసింది.
 
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ పట్టణానికి చెందిన రజిత స్థానికంగా ఉన్న డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ చదవుతోంది. అక్కడే తనతో పాటు విద్యనభ్యసిస్తున్న గఫార్ బేగ్ అనే యువకుడితో ప్రేమాయణం సాగించింది. ఈ ప్రేమాయణం సంవత్సరం నుంచి సాగుతోంది. 
 
అయితే గఫార్ బేగ్‌తో సన్నిహితంగా ఉండటంతో రజిత తల్లిదండ్రులు వెంటనే ఆమెకి పెళ్లి చేయాలని నిర్ణయానికి వచ్చారు. అందుకే తన దగ్గర బంధువు ఎల్లయ్యతో వివాహం చేసేందుకు నిశ్చయించారు. అయితే ఈ పెళ్ళి ఏమాత్రం రజితకు ఇష్టం లేదు. మొదట్లో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.
 
కానీ తను చనిపోవడం కన్నా తనను పెళ్ళి చేసుకోయేవాడిని చంపేస్తే తన ప్రియుడితోనే పెళ్ళి జరుగుతుందని భావించింది. ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ఒంటరిగా మాట్లాడాలని ఎల్లయ్యను పిలిపించుకుంది. చీకటి పడే వరకు అతనితో మాట్లాడింది. గ్రామం పొలిమేరలు కావడంతో తిరిగి తాను వెళతానంటూ వేరే బైకులో బయలుదేరి వెళ్లిపోయింది.
 
అసలు విషయం తెలియని ఎల్లయ్య కూడా బయలుదేరాడు. కానీ మార్గమధ్యంలో అప్పటికే కాపుకాసిన గఫార్ బేగ్, అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి ఎల్లయ్యపై దాడి చేశారు. అతని తలపై బండరాళ్ళతో మోది చంపేశారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments