Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త మద్యం పాలసీకి యంత్రాంగం సిద్దం

Webdunia
మంగళవారం, 1 అక్టోబరు 2019 (07:19 IST)
మద్యం కాపురంలో చిచ్చు పెడుతుంది, మానవ సంబంధాలను ధ్వంసం చేస్తుంది, అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల అమలులో భాగంగా మహిళలకు ఇచ్చిన మాట మేరకు మద్యపాన నిషేదాన్ని మూడు దశల్లో, దశల వారీగా అమలు చేయాలని మరియు మద్యం స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

ఆ నిర్ణయం అమలు చేయడంలో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇప్పటికే గ్రామాలలో బెల్టుషాపులను పూర్తిగా తొలిగించడం జరిగింది. అక్టోబర్ 1 నుండి కొత్త మద్యపాలసీలో భాగంగా, ప్రస్తుతం ఉన్నటువంటి 4,380 షాపులకుగాను కేవలం 3,500  ప్రభుత్వ మద్యం షాపులను, బెవరేజస్ కార్పోరేషన్ లిమిటెడ్ ద్వారా నడపడం జరుగుతుంది.

అంతే కాకుండా కొత్తవిధానంలో అక్టోబర్ 1 నుండి వైన్ షాపుల వేళలు గతంలో ఉన్నటువంటి సమయం (ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు) తగ్గించి ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటలకు కుదించడం జరుగుతుంది. గతంలో ఉన్నట్టుగా విచ్చలవిడిగా ఎమ్మార్పీ ఉల్లంఘన, రాబోయే రోజుల్లో నిర్వహించబడే ప్రభుత్వ మద్యం షాపులలో ఉండబోదు.

అలాగే ఎవరైనా ఎమ్మార్పీ ఉల్లంఘనకు పాల్పడితే సంబంధిత సిబ్బందిని వెంటనే తొలగించడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్త మధ్యం విధానంలో పర్మిట్ రూమ్ విధానం పూర్తిగా తొలగించబడింది.  గతంలో పర్మిట్ రూములు ఉండడం చేత మద్యం షాపు చుట్టు ప్రక్కల ఉన్న ప్రాంతాల వారికి ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు ఇకపై ఉండబోవు. 

 
దశల వారీగా మద్యపాన నిషేధం అమల్లో భాగంగా మహిళలను భాగస్వామ్యం చేసేందుకు గ్రామాలలో మహిళా పోలీసులు ద్వారా ఈ మద్యం మహమ్మారిని నిర్మూలించేందుకు ఇప్పటికే ప్రభుత్వం ప్రణాలికను సిద్దంచేసింది. అక్టోబర్ రెండవ తారీఖు నుంచి గ్రామ,వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు ప్రత్యేకంగా 14,944 మంది మహిళా కానిస్టేబుళ్ల పోస్టులను రాష్ట్ర వ్యాప్తంగా భర్తీచేసింది.

ఈ తరుణంలో మద్యం షాపులు, బార్లపై మహిళలు చేసే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉన్నత స్ధాయి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి  ఈ మేరకు గ్రామాలు, పట్టణ/నగర వార్డులలో మహిళలు దైర్యంగా ముందుకొచ్చి మహిళా కానిస్టేబుళ్లకు ఫిర్యాదు చేయవచ్చు.

ఈ సంవత్సరం ప్రభుత్వం చేపట్టిన మద్యపాన విధానం అమలు వల్ల జూన్,2019 నుండి సెప్టెంబర్,2019 వరకు 15 శాతం అమ్మకాలు తగ్గాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వచ్చే యేడాది జనవరిలో కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' రిలీజ్

ఆయనకు ఇచ్చిన మాట కోసం కడప దర్గాకు రామ్ చరణ్

ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్: భారతదేశ స్వాతంత్ర్య ప్రయాణం పునశ్చరణ

నయనతార, ధనుష్‌ల కాపీరైట్ వివాదం.. 24 గంటల్లో ఆ పనిచేయకపోతే?

దేవకి నందన వాసుదేవ షూట్ అన్నీ ఛాలెంజ్ గా అనిపించాయి : మానస వారణాసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments