Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘దిశ బిల్లు’ను ఆమోదించిన రోజే ఐదేళ్ల పాపపై అత్యాచారం

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (10:48 IST)
ఐదేళ్ల వయసున్న అభంశుభం తెలియని పాపపై తాడిపత్రి లక్ష్మారెడ్డి అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటువంటి ఉన్మాదులను కఠినంగా శిక్షించేందుకు తెచ్చిన దిశ బిల్లును అసెంబ్లీ ముక్తకంఠంతో ఆమోదించిన రోజే గుంటూరు సిటీలో ఈ ఘటన వెలుగు చూసింది.

ఈ ఉదంతంపై మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో స్పందించాయి. బాధితురాలు చికిత్స పొందుతున్న జీజీహెచ్‌ ఆస్పత్రి వద్దకు పెద్దఎత్తున చేరుకొని.. నిరసన తెలిపాయి. ‘నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేస్తారా.. లేక రెడ్డి సామాజికవర్గంవాడని చెప్పి వదిలిపెడతారా’’ అంటూ ప్రభుత్వాన్ని నిలదీశాయి. వారితో టీడీపీ, బీజేపీ మహిళా నేతలు కూడా గొంతు కలిపారు. దీంతో జీజీహెచ్‌ ప్రాంతంలో కొద్దిగంటలపాటు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. నగరంపాలెం పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో తల్లి, అమ్మమ్మలతో బాధిత బాలిక కలిసి ఉంటోంది. భర్తకు దూరంగా నర్సుగా పనిచేస్తూ ఆమె తల్లి కుటుంబాన్ని పోషిస్తోంది. వారికి ఇద్దరు పిల్లలు కాగా, బాలిక తల్లి వద్ద, కుమారుడు తండ్రి వద్ద పెరుగుతున్నారు. ఇంటికి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో బాలిక యూకేజీ చదువుతోంది. వారి ఇంటి కింద పోర్షన్‌లో లక్ష్మారెడ్డి (19) ఇంటర్‌ చదువుతున్నాడు.

గురువారం మధ్యాహ్నం భోజనం చేసి రెండు గంటల సమయంలో తల్లి డ్యూటీకి వెళ్లింది. అమ్మమ్మ గంట తర్వాత రైతు బజారుకు వెళ్లింది. కొద్దిసేపటికి బడి నుంచి బాలిక ఇంటికి వచ్చింది. ఆమె ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని లక్ష్మారెడ్డి అవకాశంగా తీసుకొన్నాడు. బాలికను గట్టిగా పట్టుకొని తన గదిలోకి తీసుకెళ్లాడు. అత్యాచారం చేశాడు 
విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
 
రాత్రి డ్యూటీ నుంచి ఇంటికొచ్చిన తల్లితో తన పొత్తికడుపుతో నొప్పిగా ఉన్నదని చెప్పి బాలిక ఏడ్చింది. ఏం జరిగిందని అడిగిన తల్లికి, జరిగిన విషయమంతా చెప్పింది. ఆ వెంటనే కుమార్తెను వెంటపెట్టుకొని వెళ్లి నగరంపాలెం పోలీ్‌సస్టేషన్‌లో తల్లి ఫిర్యాదు చేసింది. ఐపీసీ 376, పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు.

నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్టు సమాచారం. మరునాడు ఉదయం విషయం బయటకు రావడంతో మహిళా సంఘాలు ఆస్పత్రి వద్దే ఆందోళన చేపట్టాయి. బాలికను పరామర్శించి, తల్లిని వివరాలు అడిగి తెలుసుకున్నాయి. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా రోజుల వ్యవధిలోనే నిందితుడికి కఠినశిక్ష పడేలా చూడాలని గుంటూరు నగర తెలుగు మహిళా అధ్యక్షురాలు పానకాల వెంకట మహాలక్ష్మి, బీజేపీ మహిళా నేత బొల్లా ప్రగడ శ్రీదేవి, దళిత బీజేపీ నేత దర్శనపు శ్రీనివాస్‌ పరామర్శించారు. కాగా, నిందితుడు లక్ష్మారెడ్డి ఇంటర్మీడియేట్‌ చదువుతున్నప్పటికీ పదో తరగతి సర్టిఫికెట్ల ప్రకారం అతని వయసు 19 ఏళ్లుగా పోలీసులు నిర్ధారించారు.
 
కదిరిలో చిన్నారిపై అత్యాచారయత్నం.
అభం శుభం తెలియని చిన్నారి పై అత్యాచార ఘటన అనంతపురం జిల్లా కదిరిలో చోటుచేసుకుంది.కదిరి పట్టణంలోని వలిసాబ్ సాబ్ రోడ్డుకు చెందిన రెండవ తరగతి చదువుతున్న 8 సం ల చిన్నారిపై జగదీష్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు చిన్నారి తల్లి పేర్కొంది.

చిన్నారి తల్లి తెలిపిన వివరాల మేరకు రాయలసీమ సర్కిల్ లో మదరసా సగ భాగం,మరో సగ భాగం లో మణఃపురం గోల్డ్ ఫైనాన్స్ కార్యాలయం ఉంది.చిన్నారి ఉర్దూ ట్యూషన్ కు ఒక సంవత్సరం నుండి పంపుతునట్లు,రోజు వెళుతున్నట్లు ఈ రోజు కూడా ట్యూషన్ కు వెళ్ళిందని,అయితే మనఃపురం గోల్డ్ ఫైనాన్స్ లో సెక్యురిటి గా పనిచేస్తున్నా కయుమ్ అనే వ్యక్తి ఇంట్లో పండుగ కారణంగా ఇంటికి వెల్లస్లి ఉండగా గోల్డ్ ఫైనాన్స్ లో సెక్యురిటి గా పని చేసే మరో వ్యక్తి జగదీష్ కు చెప్పి కయుమ్ వెళ్ళిపోయాడు.

అయితే ట్యూషన్ కు వచ్చిన చిన్నారి పై జగదీష్ అత్యాచారానికి పాల్పడ్డాడని.భయంతో  ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసిందని చిన్నారి తల్లి తెలిపింది.మేము వెళ్లే సమయానికి జగదీష్ పారిపోయాడని తెలిపింది.ఈ విషయం పై కదిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకొని జగదీష్ కోసం గాలిస్తుమని పట్టణ సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments