Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యొయ్యో.... చంద్రబాబు ఇల్లును కృష్ణా నది ముంచేస్తోంది...

Webdunia
బుధవారం, 14 ఆగస్టు 2019 (14:41 IST)
పదేళ్ల తర్వాత కృష్ణమ్మ ఉగ్రరూపం చూపిస్తోంది. కరకట్ట అక్రమ కట్టడందారుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేశారు. పులిచింతల నుంచి ఏడున్నర లక్షల క్యూసెక్కుల ప్రవాహం ప్రకాశం బ్యారేజ్‌కు వస్తోంది. దాంతో 70 గేట్లు ఎత్తి బ్యారేజ్ నుంచి నాలుగున్నర లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. 
 
పశ్చిమ కనుమల్లో ఇంకా భారీగా వర్షాలు కురుస్తుండటంతో ప్రవాహం తీవ్రత మరింత రెట్టింపయ్యే అవకాశం ఉంది. కొద్దిరోజుల్లోనే ప్రకాశం బ్యారేజ్ వద్దకు ప్రవాహం రెట్టింపు కావొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరదతోనే కరకట్టను కృష్ణమ్మ తాకబోతోంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అక్రమ నిర్మాణదారులను అప్రమత్తం చేశారు. కరకట్టపై అక్రమంగా నిర్మించిన పలు ఆశ్రమాల్లో ఉంటున్న వారిని తరలిస్తున్నారు.
 
చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని భవనాన్ని కూడా కృష్ణమ్మ తాకుతూ ప్రవహిస్తోంది. దాంతో చంద్రబాబునాయుడు హైదరాబాద్ వెళ్లిపోయారు. చేతి గాయం కారణంగా విశ్రాంతి తీసుకునే ఉద్దేశంతోనే ఆయన హైదరాబాద్ వెళ్లారని టీడీపీ నేతలు చెబుతున్నారు. లింగమనేని భవనాన్ని వరద తాకడం ఖాయమైపోవడంతో చంద్రబాబు కాన్వాయ్‌ని అక్కడి నుంచి మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద ఉన్న హ్యాపీ రిసార్ట్స్‌కు తరలించారు. లింగమనేని భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న వస్తువులను మొదటి అంతస్తుపైకి చేర్చారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments