పవన్ కల్యాణ్... పోరాడితే పోయేదేముంది? వస్తే హోదా లేదంటే జనంలో క్రేజ్

బుధవారం, 14 ఆగస్టు 2019 (13:58 IST)
పవన్ కల్యాణ్ బుధవారం విజయవాడకు బయలుదేరి వచ్చారు. పార్టీ నాయకులతో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన విజయవాడ వచ్చిన జనసేనాని, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు పార్లమెంట్ పరిధిలోని నేతలు, కార్యకర్తలతో భేటీ కానున్నారు.
 
రేపు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని, జెండా ఎగరవేయనున్నారు. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు విజయవాడ పార్లమెంట్... మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోగల అసెంబ్లీ సెగ్మెంట్లలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.
 
పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపై పవన్ ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంపై ప్రజల్లోకి వెళ్ళే యోచనలో జనసేనాని వున్నట్లు సమాచారం అందుతోంది. 
 
స్పెషల్ కేటగిరీ స్టేటస్ వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు నేరుగా వివరించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ఏపీ ప్రత్యేక హోదా కోసం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అలుపెరగని పోరాటం చేయాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వింగ్ కమాండర్ అభినందన్‌కు #VirChakra అవార్డు..