Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాళి కడుతుండగా లాగి పడేసి అందరి ముందు ప్రియుడికి ముద్దులు, సినిమా కాదు నిజం

Webdunia
శనివారం, 21 నవంబరు 2020 (17:44 IST)
పెళ్ళి ముహూర్తం వచ్చేసింది. వరుడు తాళి చేతికి తీసుకున్నాడు. అంతే అప్పటివరకు నవ్వుతూ పెళ్ళి పీటలపై ఉన్న వధువుకు కోపమొచ్చింది. తాళిని అతడి చేతుల్లో నుంచి తీసుకుని పక్కన పడేసింది. ఇంతలో ప్రియుడు పోలీసులతో అక్కడకు వచ్చాడు. ఇంకేముంది.. పరుగెత్తుకుంటూ వెళ్లిన వధువు ప్రియుడికి ముద్దులు ఇచ్చింది. దీంతో పెళ్ళి ఆగిపోయింది. పంచాయతీ పోలీస్టేషన్‌కు వెళ్ళింది. 
 
కడపకు చెందిన భావన చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆమెతో పాటు పనిచేసే ఆకాష్‌తో ప్రేమాయణం నడుపుతోంది. అయితే ఈ విషయం తెలిసిన భావన తల్లిదండ్రులు వేరొక వ్యక్తితో వివాహం నిశ్చయించారు. పెళ్ళికి కూర్చుంది భావన. నిన్న సాయంత్రం వివాహం జరగాల్సి ఉంది. 
 
చిత్తూరు జిల్లా గుర్రంకొండలో వివాహం జరగాల్సి ఉంది. అయితే పెళ్ళి జరిగే సమయానికి వధువు లేచి నిల్చుంది. తనకు ఈ పెళ్ళి ఇష్టం లేదంటూ తాళిని వరుడు చేతుల్లో నుంచి తీసుకుని పక్కన పడేసింది. ఇంతలో పోలీసు జీపు సైరన్ కొడుతూ వచ్చి మండపం ముందు ఆగింది. అందులో నుంచి ఆకాష్ దిగాడు. అతడిని చూడగానే భావన పరుగెత్తుకుంటూ వెళ్ళి ముద్దులు ఇచ్చింది.
 
దీంతో పెళ్ళికి వచ్చిన వారందరూ అవాక్కయ్యారు. వరుడు బంధువులు పెళ్ళి మండపం నుంచి వెళ్లిపోయారు. పెళ్ళి కాస్త ఆగిపోయింది. ఇంకేముంది గుర్రంకొండ పోలీస్టేషన్‌కు వధువు, ప్రియుడు వెళ్ళారు. తాను మేజర్‌ను అనీ, తనకు ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నారని భావన కూడా పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments