Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమించానన్నాడు, శారీరకంగా దగ్గరయ్యాడు, పెళ్ళికి మూడుగంటల ముందు జంప్

Advertiesment
ప్రేమించానన్నాడు, శారీరకంగా దగ్గరయ్యాడు, పెళ్ళికి మూడుగంటల ముందు జంప్
, మంగళవారం, 10 నవంబరు 2020 (16:55 IST)
ఇంకాసేపట్లో పెళ్ళి. అంతా సిద్ధం. కరోనా కాబట్టి తక్కువమంది మాత్రమే పెళ్ళికి వచ్చారు. పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు తాలూకా బంధువులు చాలా తక్కువమంది వచ్చారు. పెళ్ళి కొడుకును లేపండి.. బాగా నిద్రపోతున్నట్లు ఉన్నాడు. త్వరగా రెడీ అవమనండి అని బంధువులు అరుస్తున్నారు. పెళ్లికొడుకు గదికి వెళ్లి చూసేసరికి కనపించలేదు. దీంతో పెళ్ళికూతురు బంధువులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
 
కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలోని మణిపాలలో నివాసముండే గణేష్ అదే ప్రాంతానికి చెందిన మమతను గత కొన్నిసంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. ఆమె వెంట తిరుగుతున్నా పట్టించుకోలేదు. కానీ సంవత్సరం క్రితం తెగించి చెప్పేశాడు. కొన్ని రోజులు గడిచాక ఆలోచన చేసుకుని, అతడి గురించి తెలుసుకున్న మమత అతడిని ఇష్టపడింది. 
 
ఇక కరోనా సమయంలో మమత ఖాళీగా ఉండడం.. ఇద్దరూ ఒకే ప్రాంతంలో ఉండటంతో శారీరకంగా కలిశారు. తనను పెళ్లి చేసుకుంటానని గణేష్ హామీ ఇవ్వడంతో తరచూ మమత అతనితో కలిసేది. తన గదికే నేరుగా వెళ్ళేది మమత. అయితే పెళ్లి చేసుకోమని చెబితే మాత్రం గణేష్ వాయిదాలు వేస్తూ వచ్చాడు. కరోనా తగ్గిన తరువాత వెంటనే పెళ్ళి చేసుకుంటానన్నాడు. కానీ వివాహం మాత్రం చేసుకోలేదు. ఇంకోవైపు తన తల్లిదండ్రులు చూసిన ఒక యువతిని పెళ్ళాడేందుకు సిద్ధమయ్యాడు. ఆ కుటుంబానికి బాగా డబ్బులు ఉండటంతో గణేష్ అటువైపు శ్రద్థ పెట్టాడు.
 
విషయం తెలుసుకున్న మమత పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు గణేష్‌ను పిలిచి వార్నింగ్ ఇచ్చారు. దీంతో మమతతో పెళ్లికి ఫిక్స్ అయ్యాడు గణేష్. మమత ఇంట్లోనే వివాహం. అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నారు. ఇంకాసేపట్లోనే పెళ్ళి జరగాల్సి ఉంది. తన స్నేహితులతో కలిసి పడుకున్న గణేష్ ఉదయాన్నే లేచి చూసేసరికి కనిపించలేదు. సరిగ్గా పెళ్ళికి మూడుగంటల ముందే ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. దీంతో మమత తను మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. గణేష్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దుబ్బాక ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం... నేతలు ఓ హెచ్చరిక : మంత్రి కేటీఆర్