తాడేపల్లి పట్టణ పరిధిలోని ప్రకాష్ నగర్లో మహిళపై దాడి జరిగింది. హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న కుంచలా రవణమ్మ అనే మహిళ దగ్గర డబ్బులు లాక్కునెందుకు యత్నించారు దుండగులు. అడ్డువచ్చిన భర్త , కోడలు బుదాల కొటేశ్వరమ్మపై బ్లేడుతో దాడి చేశారు.
బుదాల కొటేశ్వరమ్మ మెడకు గాయం అయ్యింది. ఆమెకి తృటిలో ప్రమాదం తప్పింది. యోహాను, ఏసుపాదం, శివ, అనే గంజాయి బ్యాచ్ పైన తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు భాదితులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గత పది రోజులుగా ఈ ప్రాంతంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ హల్చల్ చేస్తున్నారు. రోడ్డు మీద వచ్చే పోయేవారిని బెదిరించి దారి దోపిడీకి పాల్పడుతున్నారు. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు.