Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రుతుక్రమ నొప్పులకు చెక్ పెట్టే దాల్చిన చెక్క

Advertiesment
Cinammon
దాల్చిన చెక్కను రుచి, వాసన కోసం వంటకాల్లో వాడుతుంటాం. ఇది డిష్‌కి మంచి రుచి తేవడమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. పలు రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది. దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మహిళలు రుతుసమయంలో వచ్చే నొప్పులతో బాధపడుతుంటారు. 
 
అలాంటి బాధ నుంచి తప్పించుకోవాలంటే బియ్యం కడిగిన నీటిలో మూడు స్పూన్ల దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగితే సరిపోతుంది. ఒక్కోసారి కొంత మందికి గుండె పట్టేసినట్లు ఉంటుంది. ఆ సందర్భాలలో దాల్చిన చెక్కను చూర్ణం చేసి అందులో కొద్దిగా యాలకుల పొడి వేసి నీటిలో మరిగించాలి. ఈ మిశ్రమాన్ని కషాయం రూపంలో తీసుకుంటే వెంటనే ఉపశమనం పొందవచ్చు. 
 
తలనొప్పి తగ్గాలంటే దాల్చిన చెక్కను పొడి చేసి నీటిలో కలిపి నుదుటిపై రాసుకుంటే సరిపోతుంది. దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనె కలిపి రోజూ మూడుసార్లు క్రమం తప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. 
 
చర్మ రోగాలు, దురదలు, చెమట పొక్కులు, ఎగ్జిమా వంటివి తగ్గాలంటే కొద్దిగా తేనెను వేడి చేసి అందులో రెండు స్పూన్ల దాల్చిన చెక్క పొడిని వేసి ఆ మిశ్రమాన్ని తీసుకున్నా లేదా చర్మానికి రాసుకున్నా ఫలితం ఉంటుంది. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందుగా గ్లాస్ పాలలో 2 స్పూన్ల దాల్చిన చెక్క పొడి, కొద్దిగా చక్కెర వేసి తీసుకుంటే జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వక్షోజాలకు మసాజ్‌తో మరింత బ్యూటీ.. ఎలా?