Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరాఫ్ కంచరపాలెం, గుట్టు చప్పుడు కాకుండా శ్మశానికి యువతి మృతదేహం... ఏం జరిగింది?

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (20:33 IST)
కంచరపాలెం అనగానే మనకు ఆ పేరుతో నిర్మించిన కేరాఫ్ కంచరపాలెం చిత్రం గుర్తుకు వస్తుంది. ఇప్పుడు మరోసారి ఈ పేరు వార్తల్లోకి ఎక్కింది. విషయం ఏంటంటే... కంచరపాలెం పరిధిలో వున్న ఓ శ్మశానానికి 17 ఏళ్ల యువతి శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఆమె కుటుంబ సభ్యులు తీసుకురావడమే. అది కూడా ఎవరికీ తెలియకుండా గోప్యంగా అంత్యక్రియలు చేయాలని వారు ప్రయత్నించడం, యువతి గొంతు పైన గాయాలు వుండటంతో కాటికాపరికి అనుమానం వచ్చింది. దాంతో అసలు విషయం బయటకు వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే... విశాఖ నగరంలోని మధురవాడకు చెందిన గోరి బహుదూర్‌ అనే వ్యక్తి చైతన్య ఇంజనీరింగ్‌ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఏమైందో తెలియదు కానీ సోమవారం అతడి 17 ఏళ్ల కుమార్తె మీను అనుమానాస్పద రీతిలో చనిపోయింది. దీనితో ఆమె శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా జ్ఞానాపురం శ్మశాన వాటికకు తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. 
 
శవం వెంట కుటుంబ సభ్యులు తప్ప వేరే ఎవరూ లేకపోవడంతో కాటికాపరికి అనుమానం వచ్చి యువతి శవాన్ని పరీక్షించి చూశాడు. ఆమె గొంతుపైన గాయాలు కనబడ్డాయి. దీనితో ఏదో ఘోరం జరిగి వుంటుందని కంచరపాలెం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకుని యువతి శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించారు. 
 
రిపోర్టులో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నదన్న విషయం బయటపడితే పరువు పోతుందన్న భయంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానానికి తీసుకెళ్లినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments