డైరెక్టర్ వి.వి.వినాయక్ అనగానే ఆది, దిల్, బన్నీ, ఠాగూర్, అల్లుడు శీను, ఖైదీ నెం 150.. ఇలా భారీ చిత్రాలు గుర్తుకువస్తాయి. వరుసగా విజయాలు సాధించి డైనమిక్ డైరెక్టర్ అనిపించుకున్నారు. అయితే... వినాయ్ హీరోగా సినిమా అనే వార్త బయటకు వచ్చినప్పుడు డైరెక్టర్ వినాయక్ ఏంటి..? హీరోగా సినిమా చేయడం ఏంటి..? ఇదేదో గాసిప్ అనుకున్నారు కానీ... ఇప్పుడు సినిమా ప్రారంభం కావడంతో ఇది నిజమే అని తెలిసినప్పటికీ ఇంకా నమ్మలేకపోతున్నారు.
ఇదే విషయం గురించి వినాయక్ స్పందన ఏంటంటే... డెస్టినీ నాకు కూడా వింతగా ఉంది అన్నారు. ఇంకా వినాయక్ ఏం చెప్పారంటే... దిల్ రాజు గారు ఓ రోజు వచ్చి నువ్వు నన్ను దిల్ రాజుని చేశావ్.. నేను నిన్ను హీరోని చేద్దామనుకుంటున్నానని అన్నాడు. ఓ స్క్రిప్ట్ విన్నాను. నువ్వు అయితే బావుంటావు. చెయ్ బావుంటుందని అన్నాడు. నాకు కామెడీ, పాటలు, డ్యాన్సులు వద్దు.. హుందాగా ఉంటేనే చేస్తానని చెప్పాను. అలాంటి కథే అని దిల్ రాజు అన్నారు. తర్వాత నరసింహ వచ్చి నాకు ఈ కథను చెప్పాడు.
ఓ క్యారెక్టర్‌ను బేస్ చేసుకుని ఓ బయోపిక్ లాంటి సినిమా. తను మనసులోని ఓ కథ. తను నెరేట్ చేసేటప్పుడే ఆ క్యారెక్టర్‌ను తనెంతగా ఇష్టపడ్డాడో తెలిసింది. కొంత సమయం అడిగి పాత్ర కోసం బరువు తగ్గాను. ఈ సినిమాకి స్క్రిప్ట్ పరంగా హరి గారు సపోర్ట్ అందిస్తున్నారు. రాజన్న కథనే నమ్ముతాడు. ఆయనకు ఈ సందర్భంగా థ్యాంక్స్. ఎస్‌వీసీ బ్యానర్ అంటే నా బ్యానర్ అనే ఫీలింగ్ ఉంటుంది. నా ఇంట్లో బ్యానర్ నుండి నేను హీరోగా చేస్తున్నాను. ఫస్ట్ లుక్ బావుందని అభినందించిన అందరికీ థ్యాంక్స్“ అని వినాయ్ తెలియచేసారు.