Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ వెనుక కుట్ర: ఎమ్మెల్యే గద్దె రామమోహన్

Webdunia
బుధవారం, 1 జులై 2020 (23:02 IST)
కక్షసాధింపు చర్యలలో భాగంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసిన ప్రభుత్వం ఒక్కరోజైనా ఆయన్ను జైల్లో పెట్టాలనే ఎత్తుగడతో కుట్రపూరితంగా, నిబంధనలకు వ్యతిరేకంగా, బలవంతంగా జీజిహెచ్ నుంచి డిశ్చార్జ్ చేసిందని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ బుధవారం ఆరోపించారు. 
 
అచ్చెన్నాయుడి బెయిల్ పిటీషన్ వాదనలు ముగిసిన నేపధ్యంలో  ఏసీబి కోర్టు తీర్పు ఇవ్వనుందని, ఆ తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందనే అనుమానంతో ఒక్క రోజైనా అచ్చెన్నాయుడ్ని జైల్లో పెట్టి తన పంతం నెరవేర్చుకునే దిశగా వైకాపా ప్రభుత్వం చర్యలు ఉన్నాయని అన్నారు.

యాంటీ టైమ్ వేసి అచ్చెన్నాయుడ్ని డిస్జార్జ చేయడం దుర్మార్గం అని, కమిటీ పేరుతో డాక్టర్స్ డే రోజున తప్పుడు నివేదికలతో, ప్రభుత్వ ఒత్తిళ్ళతో అచ్చెన్నాయుడి ఆరోగ్యంతో చెలగాటం అడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. 
 
ఇప్పటికే అచ్చెన్నాయుడి అరెస్టులో రాష్ట్ర ప్రభుత్వం అనేక తప్పులు చేసిందని, రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని చేస్తున్న ప్రతి తప్పుకి వైకాపా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని గద్దె ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments