దేశంలో రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అణగదొక్కేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లపై టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ అధ్యక్షతన జరిగిన మహాధర్నాలో హస్తం నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
భాజపా న్యాయవాదుల బలహీనమైన వాదనల కారణంగానే సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై తీర్పు వ్యతిరేకంగా వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లపై టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద జరిగిన మహాధర్నాలో హస్తం నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.