Webdunia - Bharat's app for daily news and videos

Install App

విలేకరి హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (07:15 IST)
ఆంధ్రజ్యోతి విలేకరిగా తూర్పు గోదావరి జిల్లా తొండంగి ప్రాంతంలో పనిచేస్తున్న  కాతా సత్యనారాయణను అమానుషంగా హత్య చేయడాన్ని ఏపీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తోంది.

ఇది ఒక ఆటవిక చర్యగా భావిస్తోంది. ఈ సంఘటన తీరు చూస్తుంటే మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. ఈ సంఘటన ప్రజాస్వామ్యానికి మూల స్థంభం అయిన జర్నలిజాన్ని చంపినట్లుగా ఉంది .ఈ విధమైన అమానుష చర్యలు ద్వారా కలాలకు సంకెళ్లు వేయాలని చూడడం శోచనీయం.

ఈ హత్య వెనుక పెద్ద కుట్ర దాగి వుంటుందనే  అనుమానం వ్యక్తం అవుతోంది.కాతా సత్యనారాయణ అమానుష హత్యను తీవ్రంగా ఖండిస్తూ బుధవారం ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ ఆధ్వర్యంలో  సబ్ కలెక్టర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి విన్నవించాం.

తక్షణమే ప్రభుత్వం దోషులను గుర్తించి వెంటనే ఆరెస్టు చేయాల్సిందిగా   సబ్ కలెక్టర్ కార్యాలయం లో  అందజేసిన వినతిపత్రం ద్వారా తెలియజేయడమైంది. హత్యకు గురైన సత్యనారాయణ కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేయడమైంది.

వినతిపత్రం అందచేసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష,కార్యదర్సులు నిమ్మరాజు చలపతిరావు, ఆర్ వసంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎస్ కె బాబు, దారం వెంకటేశ్వరరావు, చిన్న పత్రికలు సంఘం నాయకులు సి.హెచ్. రమణా రెడ్డి.ఎం. వి.సుబ్బారావు, ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శి దాసరి నాగరాజు,కార్య వర్గ సభ్యులు బి. డేవిడ్, టి.శివరామకృష్ణ తదితర జర్నలిస్టులు వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments