Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

ఠాగూర్
ఆదివారం, 22 జూన్ 2025 (19:41 IST)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మృతి చెందిన సింగయ్యకు సంబంధించిన సంచలన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. సింగయ్య తొలుత జగన్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని మృతి చెందాడని భావించారు. అయితే, జగన్ కారే స్వయంగా సింగయ్య మెడపై నుంచి వెళ్లిన వీడియో ఒకటి తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 
 
సింగయ్యను ఢీకొట్టిన కారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయాణించిన కారని వార్తలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి, పరిశీలించారు. అలాగే, ప్రత్యక్ష సాక్షుల నుంచి వీడియోలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో పోలీసులకు కీలకమైన వీడియో ఆధారం ఒకటి లభించింది. 
 
జగన్ ప్రయాణిస్తున్న కారు చక్రాల కింద పడి నలిగిపోతున్న దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియోలో జగన్ కారు పైనుంచి పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా, అదేసమయంలో మరో ఓ కార్యకర్త కారు టైర్ల కింద పడి నలిగిపోతుండటం స్పష్టంగా రికార్డయింది. మరో వీడియోలో కారు కింద వృద్ధుడు పడినట్టు స్థానికులు కేకలు వేస్తున్నా.. వాహనాన్ని ఆపకుండా ముందుకు పోనిచ్చినట్టు కనిపించింది. 
 
ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగయ్య మృతికి కారణమైన వారిపై, ముఖ్యంగా, జగన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇంతటి దారుణ ఘటన జరిగినా తన కాన్వాయ్ కారణంగా సొంత పార్టీ కార్యకర్త మరణిస్తే కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయకపోవడంపై జగన్ తీరును పలువురు తప్పుబడుతున్నారు. 


ఒక నేత ర్యాలీకి వెళ్లి… ఎవరికైనా ప్రాణం పోయే పరిస్థితి రాకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments