Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు రిమాండా.... బెయిలా... సర్వత్రా ఉత్కంఠ!!

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (17:08 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి ఆయనను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆదివారం ఉదయం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత ఇరువర్గాల వాదనలు ఆరున్నర గంటల పాటు సుధీర్ఘంగా జరిగాయి. చంద్రబాబును 15 రోజుల పాటు రిమాండ్‌కు పంపాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరగా, సీఐడీ అధికారులు మాత్రం బెయిల్ ఇవ్వాలంటూ వాదనలు వినిపించారు. అయితే, న్యాయమూర్తి మాత్రం తుది తీర్పును సాయంత్రం 5.30 గంటలకు వెల్లడించనున్నారు. 
 
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ తిరస్కరణ?
 
స్కిల్ డెవలప్‌మెంట్‌లో అవినీతి జరిగిందనే కేసుకు సంబంధించి విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా ఏసీబీ పేర్కొంది. ఇరుపక్షాల వాదనలను ఆలకించిన జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. సాయంత్రం 4 గంటలకు కాసేపట్లో తీర్పును వెలువరించారు. కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబును రిమాండ్ కు ఇవ్వాలనే పిటిషన్‌ను కోర్టు తిరస్కరిస్తుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
 
 
మరోవైపు బాబుకు రిమాండ్ విధించడం ఖాయమని అధికార వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరో అర గంటలో జడ్జ్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా... సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి బృందం వాదనలు వినిపించింది. మరోవైపు, ఆదివారం ఉదయం నుంచి సుధీర్ఘంగా ఏకంగా ఆరున్నర గంటల పాటు విచారణ సాగింది. 
 
కాగా, వాదనల అనంతరం కోర్టు బయటికి వచ్చిన చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా విజయసంకేతం ఇచ్చారు. బొటనవేలు పైకెత్తి అంతా ఓకే అనే సంజ్ఞ చేశారు. ఈ ఉదయం 8 గంటల నుంచి ఏసీబీ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఓవైపు చంద్రబాబు తరపున సుప్రీంకోర్టులో ఎంతో అనుభవం ఉన్న సిద్ధార్థ లూథ్రా... మరోవైపు సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. కోర్టు అనుమతితో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్వయంగా వాదనలు వినిపించారు. తన అరెస్టు అక్రమం అని ఆక్రోశించారు. 
 
కాగా, చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించారు. 'నిన్న సాయంత్రం 4 గంటల నుంచి విజయవాడలో చంద్రబాబు కోసం ఎదురుచూస్తున్నాం. నా న్యాయవాద వృత్తిలో ఏనాడూ ఇటువంటి పరిస్థితి ఎదుర్కోలేదు' అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Idli Kottu Review: ధనుష్ ఇడ్లీ కొట్టుతో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా... ఇడ్లీ కొట్టు రివ్యూ

Nayana tara: మన శంకర వర ప్రసాద్ గారు జీవితంలో శశిరేఖ ఎవరు...

పవన్ కళ్యాణ్ "ఓజీ" : 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' అంటున్న నేహాశెట్టి

Bigg Boss Telugu 9: జయం సుమన్ శెట్టికి పెరుగుతున్న మద్దతు..

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments