Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఓవరాక్షన్.. భార్యకూతుళ్లపై దాడి (వీడియో)

సెల్వి
శనివారం, 10 ఆగస్టు 2024 (10:47 IST)
Duvvada Srinivas
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. దువ్వాడ శ్రీను ఇంట్లోకి ఆయన భార్య వాణి, కుమార్తెలు వెళ్లడంతో పరిస్థితి తారుమారైంది. వాణి, శ్రీనుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మాటలు హద్దులు మీరి దాడులకు దారితీసింది. 
 
పెద్ద కుమార్తె హైందవి‌తో కలిసి దువ్వాడ శ్రీనివాస్ నూతనంగా నిర్మించిన ఇంటికి ఆయన సతీమణి దువ్వాడ వాణి వచ్చారు. ఇంటి గేట్లను బలవంతంగా తెరిచి వాణి, హైందవిలు లోనికి ప్రవేశించారు. బయట నుంచి వచ్చిన శ్రీనివాస్ ఒక్క సారిగా భార్యాకూతురిని చూసి చిందులు తొక్కారు. 
 
భార్యా కూతురిని చంపేస్తాను అంటూ గ్రానైట్ రాయి పట్టుకుని వారిపైకి దూసుకెళ్లారు. పోలీసులు ఆయనను అదుపు చేశారు. ఈ సందర్భంగా వాణి మాట్లాడుతూ.. తన భర్త వివాహేతర సంబంధం కారణంగా తమ కుటుంబం పరువు పోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన తాను.. తన భర్త నిర్వాకంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నానని తెలిపారు. తన భవిష్యత్తు ఎలా ఉన్నా పర్వాలేదని, తన కుమార్తెల భవిష్యత్తు కోసం ఆలోచిస్తే ఆందోళన కలుగుతోందని కన్నీటిపర్యంతమయ్యారు. 
 
తన భర్తపై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని వాణి కోరారు. ఇకపోతే.. దువ్వాడ భార్యాపిల్లలపై దాడికి ప్రయత్నించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments