Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్: నేను నీకు వున్నా అని నన్ను చేరదీశారంటున్న మాధురి

Madhuri press meet

ఐవీఆర్

, శుక్రవారం, 9 ఆగస్టు 2024 (23:50 IST)
వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో తనకు గల సంబంధం గురించి మాధురి అనే మహిళ నోరు విప్పింది. ఆమె మాట్లాడుతూ... నాకు ఇదివరకే పెళ్లయింది. ఆయనకూ అయ్యింది. మేమిద్దరం విడాకులు తీసుకోలేదు. అలాగని మాది సహజీవనం కాదు. ఎందుకంటే మేమిద్దరం ఇదివరకే పెళ్లి చేసుకున్నాము ఐతే కలిసి వుంటున్నాము. నేను ఆత్మహత్య చేసుకోబోయే స్థితిలో నేను నీకున్నానంటూ ఆయన నన్ను చేరదీశారు. ఇక అప్పట్నుంచి నేను ఆయనతోనే వుంటున్నాను. ఇదేమీ తప్పు కాదు. కోర్టులు కూడా దీన్ని తప్పుపట్టడం లేదు కదా" అంటూ వెల్లడించారు.
 
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కాపురం బజారున పడింది. మొదటి భార్య వాణిని కాదని మరో మహిళ దివ్వెల మాధురితో సహజీవనం చేస్తున్న వ్యవహారం బయటపడింది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరు కూతుళ్లు ఉన్నప్పటికి భార్య, పిల్లల దగ్గర ఉండకుండా దివ్వెల మాధురితో కలిసి జీవిస్తున్నాడని స్వయంగా కూతుళ్లు హైందవి, నవీన తండ్రిని కలిసి నిలదీయాలని ప్రయత్నించారు. అయితే పోలీసులు అనుమతించకపోవడంతో విషయాన్ని మీడియాకు తెలియజేశారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది.
 
తన భర్త దువ్వాడ శ్రీనివాస్‌తో ఉండాలని కోరుకోవడం లేదని దువ్వాడ వాణి స్పష్టం చేశారు. ఆయన వల్ల తన కుటుంబం పరువు పోతుందని అన్నారు. దువ్వాడ శ్రీనివాస్‌ టెక్కలి వదిలివెళ్లాలని డిమాండ్‌ చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌ వల్ల తనకేమీ ఆస్తులు రాలేదని స్పష్టం చేశారు.
 
చొక్కా లుంగీతో వచ్చిన శ్రీనివాస్‌కు ఎలాంటి ఆస్తులు లేవని వెల్లడించారు. ఆయన రాజకీయాలతో తామే ఎక్కువగా నష్టపోయామని తెలిపారు. కూతురుకు పెళ్లైన తరుణంలో శ్రీనివాస్‌కి ఈ బుద్ధులేంటని ప్రశ్నించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తనకు తగిన శాస్తి జరిగిందన్నారు. 
 
అయితే దువ్వాడ శ్రీనివాస్ భార్య, పిల్లలు చేస్తున్న ఆరోపణలకు దివ్వెల మాధురి కౌంటర్ ఇచ్చారు. తమది ఇల్లీగల్ అఫైర్ కాదని తెలిపింది. ఇంత వరకు వచ్చింది కాబట్టి ఇకపై ఆయనతోనే కలిసి ఉంటానని తెగేసి చెప్పింది మాధురి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిటైల్ టచ్ పాయింట్స్ పెంపుతో 2025లో 40 శాతం అభివృద్ధికై మైట్రైడెంట్