Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవాలయాల్లో హుండీ దొంగతనాలకు పాల్పడే ముఠా అరెస్ట్

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (15:10 IST)
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ‌ల ముఠాను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.  గుంటూరు ఎస్పీ అరి ఫ్ హాఫిజ్ మీడియాతో మాట్లాడుతూ, గుడిలో హుండీలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడే 9 మందిని అరెస్ట్ చేశారు. 
 
 
నిందితుల నుంచి ఒక ఆటో, రెండు బైక్ లు, కట్టర్లు, 4,600 న‌గ‌దు స్వాధీనం చేసుకున్నామ‌ని గుంటూరు ఎస్పీ అరిఫ్ హాఫిజ్ చెప్పారు. నిందితులు అంతా గుంటూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించామ‌ని ఎస్పీ తెలిపారు. 

 
దేవాలయాలల్లో దొంగతనాలకు పాల్పడే మ‌రో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నార‌ని, వారికోసం గాలిస్తున్నామ‌ని చెప్పారు. గుంటూరు అర్బన్ పరిధిలో సమస్యాత్మక‌ ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నామ‌ని, జిల్లా ఎస్పీ కార్యలయంలో బాధితులు ఫిర్యాదులు చేయ‌డానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామ‌ని ఎస్పీ అరిఫ్ హాఫిజ్ చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంద‌ని వివరించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments