Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో పదవ తరగతి పరీక్షలు... షెడ్యూల్ వివరాలు

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (20:38 IST)
పదవ తరగతి పరీక్షలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆరు సబ్జెక్టులకు 11 పేపర్లుండగా కరోనాతో వాటిని ఆరు పేపర్లకు కుదించింది. 
 
80 మార్కులకు ఎగ్జామ్.. 20 మార్కులకు ఇంటర్నల్స్ ఉండనున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా సిలబస్‌ను 70 శాతానికి తగ్గించిన సర్కార్.. తాజాగా పేపర్లను కూడా కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
అవసరమైతే పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఎగ్జామ్స్ నిర్వహించాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. మే 17 నుంచి 26 వరకు పరీక్షలు జరుగనున్న నేపధ్యంలో పిల్లలకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
 
టెన్త్ పరీక్షలు రాసేందుకు 3.15 గంటల సమయం ఉంటుందని.. విద్యార్థులకు ఎక్కువ ఛాయిస్ ఉండేలా ప్రశ్నల సంఖ్య కూడా పెంచనున్నట్టు తెలిపారు. ఎస్‌ఎస్‌సీ పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌ అకాడమిక్‌ ఇయర్‌ 2020-2021కు గాను మొత్తం 11 పరీక్షా పేపర్లను 6 పేపర్లకు కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది విద్యాశాఖ. 
 
కొత్త విధానం ప్రకారం.. ఫస్ట్‌ లాంగ్వేజ్‌, ఇంగ్లీష్‌, మాథమెటిక్స్‌, జనరల్‌ సైన్స్‌(ఫిజిక్స్‌&బయాలజీ), సోషల్‌ స్టడీస్‌కు చెందిన పేపర్‌ -1, పేపర్‌-2లు ఒకే పరీక్షా పేపర్‌గా ఉండనున్నాయి. సెకండ్‌ లాంగ్వేజ్‌లో ఏ విధమైన మార్పు లేకపోగా.. ఫిజిక్స్‌, బయాలజీకి సంబంధించిన సమాధానాలు.. వేర్వేరు షీట్లలోనే రాయాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
 
ఆంధ్రప్రదేశ్ 
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. జున్‌ 7 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయి. జున్‌ 16వ తేదీతో ముగుస్తాయి. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 7 పేపర్లుగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hebba Patel: తమన్నా లా అలాంటి హోంవర్క్ చేయాలని నేర్చుకున్నా : హెబ్బా పటేల్

కుంతీదేవి కోసం కురుక్షేత్ర యుద్ధం చేసిన అర్జునుడు గా కళ్యాణ్ రామ్

Surya: గేమ్ ఛేంజర్ వల్ల సూర్య రెట్రో లో మెయిన్ విలన్ మిస్ అయ్యింది : నవీన్ చంద్ర

విద్యార్థుల సమక్షంలో త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి పాట విడుదల

జాక్ చిత్రంలో బూతు డైలాగ్ లుంటాయ్ : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments