Webdunia - Bharat's app for daily news and videos

Install App

భరత్ కారు వేగం.. గంటకు 140 కిమీ : బ్రేకు వేయలేనంతగా మద్యం కైపు..

హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో హీరో రవితేజ సోదరుడు భరత్ దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణించిన కారు గంటకు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టు కారు స్పీడో మీటర్ రుజువు చే

Webdunia
ఆదివారం, 25 జూన్ 2017 (14:53 IST)
హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో హీరో రవితేజ సోదరుడు భరత్ దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణించిన కారు గంటకు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టు కారు స్పీడో మీటర్ రుజువు చేస్తోంది. దీనికితోడు బ్రేకు వేయలేనంతగా మద్యం కైపుతో ఉన్నట్టు సమాచారం. 
 
కాగా, శనివారం రాత్రి హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో జరిగిన ఓ పార్టీలో పాల్గొని ఆ తర్వాత తమ కుటుంబానికే చెందిన స్కోడా కారును స్వయంగా నడుపుకుంటూ వెళ్లిన భరత్ రాజు, ఆ కారును ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. 
 
ప్రమాద సమయంలో కారులో వోడ్కా మద్యం బాటిళ్లు ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని, భరత్ మద్యం తాగి ఉన్నారా? లేదా? అన్న విషయం పోస్టుమార్టం నివేదికలో వెల్లడవుతుందని తెలిపారు.
 
ప్రమాదం గురించి ముందే పసిగట్టి బలంగా బ్రేకులు వేసినట్టుగా రోడ్డుపై పడ్డ టైర్ గుర్తులు చూపుతున్నాయని అన్నారు. ప్రమాదంలో ఆయన ఎడమ కాలు, కుడి చెయ్యి విరిగిపోయాయని, తలకు బలమైన గాయం తగిలిందని, తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేసేంత సమయం కూడా లేకుండానే ఆయన ప్రాణాలు పోయి ఉండవచ్చని పోలీసులు చెపుతున్నారు. 
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments