Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఇద్దరితో సెల్ఫీ తీసుకుంటాం... కాస్త నవ్వండి సార్.. : ఇద్దరు చంద్రులతో సానియా మీర్జా

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ నగరానికి వచ్చివున్నారు. ఆయన గౌరవార్థం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంగళవారం రాత్రి విందు ఇచ్చారు.

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (13:08 IST)
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ నగరానికి వచ్చివున్నారు. ఆయన గౌరవార్థం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంగళవారం రాత్రి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖర్ రావులతో పాటు.. క్రీడాకారిణులు సానియా మీర్జా, పీవీ సింధు, కోచ్ గోపీచంద్ ఇంకా కేంద్ర రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. 
 
ఆ సమయంలో తన వద్దకు వచ్చిన అతిథులను పలకరించి వారితో ఫొటోలు దిగే పనిలో రాష్ట్రపతి నిమగ్నమయ్యారు. దీంతో ముఖ్యమంత్రులు ఇద్దరూ కొద్దిగా పక్కకు వచ్చి లోకాభిరామాయణం మాట్లాడుకొన్నారు. విభజన సమస్యలను కూడా ప్రస్తావించారు. దాదాపు 20 నిమిషాల పాటు ఇద్దరూ నిలబడే కబుర్లు చెప్పుకొన్నారు.
 
ముఖ్యమంత్రులు మాట్లాడుకొంటున్నప్పుడు క్రీడాకారిణులు సానియా మీర్జా, పీవీ సింధు, కోచ్ గోపీచంద్ వారి వద్దకు వచ్చారు. "మీరిద్దరూ ఒకేచోట చాలా తక్కువగా ఉంటారు. మీ ఇద్దరితో కలిసి మేం సెల్ఫీ తీసుకొంటాం" అని సానియా కోరగానే సీఎంలిద్దరూ నవ్వుతూ అంగీకరించారు. ఫొటో తీసేటప్పుడు నవ్వండి సార్‌ అని సానియా విజ్ఞప్తి చేసినప్పుడు ఇద్దరూ గట్టిగా నవ్వేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రాజమౌళి, మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ తెలిపిన రామ్ చరణ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments