Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజ్ పై యానిమేషన్లు ఆపి, చిన్నారికి న్యాయం చేయండి

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (16:03 IST)
తెలుగు టీవీ న్యూస్ ఛాన‌ళ్ళపై టాలీవుడ్ న‌టుడు మంచు మ‌నోజ్ సెటైర్ వేశారు. హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్ పై యానిమేష‌న్లు వేయ‌డం ఆపి, న్యూస్ ఛానళ్ళు ద‌ళిత బాలిక కుటుంబానికి న్యాయం జ‌రిగేలా చూడాల‌ని ఘాటుగా విమ‌ర్శించారు.
 
న‌టుడు మంచు మనోజ్ సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్నారికి జరిగింది క్రూరత్వం అని, దీనికి మనందరం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల‌ని, ఆడ పిల్లలను ఎలా గౌరవించాలో అందరికీ నేర్పాల‌ని అన్నారు. ఈ కిరాత‌కానికి పాల్ప‌డిన నిందితుడు ఇంకా దొరకలేదని పోలీసులు అంటున్నారు... ప్రభుత్వం, పోలీసులు దీనిని సీరియస్ గా తీసుకోవాల‌ని సూచించారు. 
 
చత్తీస్ఘడ్ లో మూడేళ్ళ క్రితం చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసులో ఉరిశిక్ష వేయాలని ఇప్పుడు తీర్పు వచ్చింద‌ని, న్యాయం ఇంత ఆల‌స్యం కాబ‌ట్టే, సంఘ‌ట‌న‌లు పునరావృతం అవుతున్నాయ‌ని అన్నారు. నిందితుల‌ను 24 గంటల్లో పట్టుకొని కఠినంగా శిక్షించాల‌ని న‌టుడు మంచు మ‌నోజ్ అన్నారు. టీవీ చానళ్లలో సాయి ధరమ్ తేజ్ గురించి యనిమేషన్లు వేయకుండా,  ఇలాంటి వాళ్లకు న్యాయం జరిగేలా చూడాల‌ని సూచించారు. చిన్నారి ఫామిలీకి ఎల్లవేళలా తాము తోడుగా ఉంటామ‌న్నారు మంచు మ‌నోజ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్లీజ్.. మాజీ భార్య అని పిలవొద్దు : రెహ్మాన్ సతీమణి సైరా

సమంతకు మళ్లీ ఏమైంది? అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్

డీహైడ్రేషన్ వల్లే ఏఆర్ రెహ్మన్ అస్వస్థతకు లోనయ్యారు : వైద్యులు

హైలెట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో బయటకు వస్తున్నారు : అన్నపూర్ణమ్మ

ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్ : స్పందించిన సోదరి ఫాతిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

తర్వాతి కథనం
Show comments