Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడు 6 కేజీలు.. ఇప్పుడు 5.5 కేజీల మగ శిశువు జననం.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (13:00 IST)
సాధారణంగా శిశువులు 3 నుంచి 4 కేజీల మధ్యలో జన్మిస్తూ ఉంటారు. గతంలో హైదరాబాద్ నగరంలోని నీలోఫర్‌ ఆసుపత్రిలో 6 కేజీల బరువుతో ఓ బాబు జన్మించాడు. తాజాగా భద్రాద్రిలో 5.5 కేజీల బాబు జన్మించడం రెండో రికార్డుగా నమోదైంది. కానీ భద్రాచలంలోని చర్చి రోడ్డులో ఉన్న జీవన్‌ వైద్యశాలలో ఓ చిన్నారి గురువారం 5.5 కేజీల బరువుతో సంపూర్ణ ఆరోగ్యంతో జన్మించింది. ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యం కూడా క్షేమంగా ఉంది.
 
వివరాల్లోకి వెళితే.. భద్రాచలంలోని చర్చి రోడ్డులో ఉన్న జీవన్‌ వైద్యశాలలో ఓ చిన్నారి గురువారం 5.5 కేజీల బరువుతో సంపూర్ణ ఆరోగ్యంతో జన్మించింది. ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యం కూడా క్షేమంగా ఉంది. ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన జట్టి సంధ్య కాన్పు కోసం జీవన్‌ వైద్యశాలలో చేరింది. అక్కడ ఆమెని పరీక్షించిన వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు. 
 
కాగా ఆమె 5.5 కేజీల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే గురువారం జన్మించిన ఈ శిశువు సాధారన బరువుకంటే ఎక్కువగా వుండటం గమనార్హం. మొదటి కాన్పులో ఆడపిల్లకు జన్మించిన సంధ్య, రెండో కాన్పులో బాబుకు జన్మనిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments