కుమార్తెతో కలిసి నీట్ ప్రవేశ పరీక్ష రాసిన తల్లి!

ఠాగూర్
సోమవారం, 5 మే 2025 (10:28 IST)
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షలు మే 4వ తేదీ ఆదివారం దేశ వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా సుమారుగా 22.3 లక్షల మంది హాజరయ్యారు. ఈ పరీక్షలకు ఓ మహిళ తన కుమార్తెతో కలిసి హాజరైంది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో జరిగిన నీట్ పరీక్షల్లో వీరిద్దరూ వేర్వేరు పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాశారు. 
 
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం, మంచ్యానాయక్ తండాకు చెందిన భూక్యా సరిత (38) ప్రస్తుతం ఆర్ఎంపీగా పనిచేస్తున్నారు. 2007లో బీఎస్సీ నర్సింగ్ చివరి సంవత్సరంలో ఉండగా వివాహం కావడంతో పరీక్ష రాయలేకపోయారు. ఆ తర్వాత ఇద్దరు కుమార్తెలు జన్మించడంతో కోర్సును పూర్తి చేయలేకపోయారు. 
 
అయితే, ఆమె భర్త భూక్యా కిషన్ కూడా ఆర్ఎంపీగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ తమ కుమార్తెను ఎంబీబీఎస్ చదివించి డాక్టర్ చేయాలనుకున్నారు. ఖమ్మంలో కుమార్తె నీట్ శిక్షణ పొందుతున్న సమయంలో తల్లికి కూడా పరీక్ష రాయానే ఆకాంక్ష కలిగింది. దీంతో ఆమె కూడా పరీక్షకు సన్నద్ధమయ్యారు. తల్లి సరిత సూర్యాపేట ప్రభుత్వం జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రంలోనూ, కుమార్తె కావేరి ఖమ్మంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎన్ఎస్సీ క్యాంపు కేంద్రంలో పరీక్ష రాశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments