Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో తెలంగాణ మంత్రి పోచారంకు తీవ్ర అస్వస్థత

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను అశ్విని ఆస్పత్రికి టిటిడి సిబ్బంది తరిలించి ప్రాథమిక చికిత్స అందిస్తున

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (10:28 IST)
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను అశ్విని ఆస్పత్రికి టిటిడి సిబ్బంది తరిలించి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. 
 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. కేసీఆర్ వెంట కుటుంబ సభ్యులతో పాటు ఆ రాష్ట్ర మంత్రులు వచ్చారు. వీరంతా బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అతిథిగృహానికి చేరుకున్న ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే ఆయన్ను స్థానిక అశ్వని వైద్యశాలకు తరలించారు.
 
కొండపైనే ఉన్న అపోలో వైద్యుల బృందం వెంటనే అక్కడకు చేరుకొని ఆయన్ను పరీక్షించి వైద్యసేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోచారానికి అందిస్తున్న వైద్యసేవలను జేఈవో శ్రీనివాసరాజు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. లోబీపీ కారణంగానే ఆయన అస్వస్థతకు గురైనట్టు సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments