Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూ కాశ్మీర్‌లో పెళ్లి.. 500 మందినే పిలవాలి.. స్వీట్స్, డ్రైఫ్రూట్స్ ఇస్తే?

పెళ్ళిని వైభవంగా అట్టహాసంగా.. గుర్తుండిపోయేలా చేయాలని అందరూ అనుకుంటారు. అయితే జమ్మూ కాశ్మీర్‌లో మాత్రం పెళ్ళిళ్లకు వచ్చే వారిపై ఆంక్షలు విధించారు. జమ్మూ రాష్ట్రంలో జరిగే పెళ్లిళ్లకు అతిథులను ఆహ్వానించ

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (10:12 IST)
పెళ్ళిని వైభవంగా అట్టహాసంగా.. గుర్తుండిపోయేలా చేయాలని అందరూ అనుకుంటారు. అయితే జమ్మూ కాశ్మీర్‌లో మాత్రం పెళ్ళిళ్లకు వచ్చే వారిపై ఆంక్షలు విధించారు. జమ్మూ రాష్ట్రంలో జరిగే పెళ్లిళ్లకు అతిథులను ఆహ్వానించడంపై ఆ రాష్ట్ర సర్కారు పరిమితి విధించింది. ఈ నిబంధనలు ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది.

పెళ్లిళ్ల ఖర్చుకు సంబంధించి లోక్‌సభలో ఇదే తరహా బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కాశ్మీర్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అమ్మాయి పెళ్లిచేసేవారు గరిష్ఠంగా 500 మందిని, అబ్బాయి పెళ్లి చేసేవారు 400 మందినే ఆహ్వానించాలని పేర్కొంది. 
 
ఇక నిశ్చితార్థం వంటి చిన్నపాటి శుభకార్యాలను 100 మంది అతిథుల సమక్షంలో మాత్రమే జరుపుకోవాలని సూచించింది. అంతేకాదు.. లౌడ్‌స్పీకర్లు ఉపయోగించడంపై, బాణసంచా కాల్చడంపై, ఆహ్వాన పత్రికతో స్వీట్లు, డ్రైఫ్రూట్స్‌ వంటివి అందించడంపై నిషేధం విధించింది. రాష్ట్రంలోని వనరులు భారీ పెళ్లిళ్ల పేరిట దుర్వినియోగం కాకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments