పారిపోయి వచ్చిన యువతిని బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (16:59 IST)
ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన యువతిని బలవంతంగా చెట్లపొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడో కామాంధుడు. ఆ తర్వాత వివాహం చేసుకుంటానని నమ్మించి పరారయ్యాడు. నల్లగొండ జిల్లా కనగల్‌ మండలం పర్వతగిరి గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన నీలకంఠం రవి సికింద్రాబాద్ నగరానికి చెందిన ఓ యువతి తండ్రి మందలించాడన్న కోపంతో సదరు యువతి ఇంట్లో నుంచి పారిపోయి నాయనమ్మ ఇంటికి వెళ్లింది. ఆ యువతిని చూసిన అదే గ్రామానికి వెళ్తున్నానని చెప్పి నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామానికి తీసుకొచ్చి పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. 
 
ఆ తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఇక్కడే ఉండు వెళ్లి తాళిబొట్టు తీసుకువస్తాను అని పరారయ్యాడు. విషయం తెలిసిన బాధితురాలి తండ్రి చెర్వుగట్టు గ్రామానికి వచ్చి తన కుమార్తెను తీసుకుని ఇంటికి వెళ్లాడు. తన కూతురికి జరిగిన అన్యాయంపై నార్కట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేసినందుకు నల్లగొండ అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి గతంలో నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధించగా నిందితుడు జిల్లా న్యాయస్థానంలో అప్పీల్‌ చేశాడు. నల్లగొండ మొదటి అదనపు న్యాయమూర్తి ఎస్‌.వెంకటేశ్వర్‌ప్రసాద్‌ కూడా అదే తీర్పును అమలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

The Girlfriend Review : రష్మిక మందన్నా నటించిన ది గాళ్ ఫ్రెండ్ రివ్యూ

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments