Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో భార్య.. మరో గదిలో పరాయి మహిళతో రాసలీలలు...

పక్క గదిలో భార్య ఉండగానే మరో గదిలో పరాయి మహిళతో రాసలీలలు కొనసాగిసాంచాడో ప్రబుద్ధుడు. ఈ విషయం తెలుసిన ఇరుగుపొరుగువారు ఆయన్నుపట్టుకుని చితక్కొట్టారు. ఈ ప్రబుద్ధుడు పేరు శ్రీనివాస్. ప్రభుత్వ పాఠశాలలో అసి

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (09:34 IST)
పక్క గదిలో భార్య ఉండగానే మరో గదిలో పరాయి మహిళతో రాసలీలలు కొనసాగిసాంచాడో ప్రబుద్ధుడు. ఈ విషయం తెలుసిన ఇరుగుపొరుగువారు ఆయన్నుపట్టుకుని చితక్కొట్టారు. ఈ ప్రబుద్ధుడు పేరు శ్రీనివాస్. ప్రభుత్వ పాఠశాలలో అసిస్టెంట్. సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
వేములవాడ పట్టణానికి చెందిన హన్మండ్ల శ్రీనివాస్‌ అదే మండలంలోని చెక్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయన 20 ఏళ్ల క్రితం ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పద్మను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. పద్మ కూడా ఎదురుగట్ల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
అయితే, గత 4నెలలుగా శ్రీనివాస్‌ సమయానికి ఇంటికి రాకపోవడం, తరుచూ గొడవలకు దిగడంతో భర్త ప్రవర్తనపై పద్మకు అనుమానం కలిగింది. బంధువుల సహకారంతో శ్రీనివాస్‌ దిన చర్యపై ఆరా తీసింది. దీంతో సిరిసిల్ల పట్టణం సర్ధార్‌నగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ వేములవాడకు చెందిన మరో మహిళతోని సహజీవనం చేస్తున్నట్లు తెలుసుకుంది. ఆ తర్వాత ఆ మహిళను తన ఇంటికి కూడా తీసుకొచ్చి భార్య ఎదుటే రాసలీలలు కొనసాగిస్తూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో బుధవారం బక్రీద్‌ సెలవు అయినప్పటికీ ఇంటికి రాకపోవడంతో భార్య పద్మ మహిళా సంఘాలతో కలిసి సిరిసిల్లకు వచ్చింది. అద్దెకు ఉంటున్న ఇంట్లోకి చొరబడి శ్రీనివాస్‌, సదరు మహిళను పట్టుకొని దేహశుద్ధి చేసింది. దీంతో సదరు మహిళ శ్రీనివాస్‌ తనను వివాహం చేసుకున్నాడని పద్మతో వాగ్వాదానికి దిగడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి కి చేరుకొని శ్రీనివాస్‌తో పాటు సదరు మహిళను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments