Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయీమ్ కేసులో 93 మంది అరెస్ట్.. 126 ఫిర్యాదులున్నాయ్..

గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో తీగ లాగితే డొంకలు కదులుతున్నాయి. ఈ కేసులో అధికారుల విచార‌ణ ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. నయీమ్ కేసులో అధికార తెరాస నేతలతో పాటు.. ఇతర రాజకీయ నేతలు, అధికారులకు కష్టాలు తప్పేలా లేవ

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (15:24 IST)
గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో తీగ లాగితే డొంకలు కదులుతున్నాయి. ఈ కేసులో అధికారుల విచార‌ణ ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. నయీమ్ కేసులో అధికార తెరాస నేతలతో పాటు.. ఇతర రాజకీయ నేతలు, అధికారులకు కష్టాలు తప్పేలా లేవు. నయీమ్ భూదందాలకు సహకరించిన నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రెవెన్యూ అధికారులను ఇప్పటికే విచారించిన సిట్ అధికారులు వారి పేర్లను ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. నయీమ్ ఇంట్లో సేకరించిన ఫోటో ఆల్బమ్‌లతో పాటు, నయీమ్ ఫోన్‌కాల్ డేటా ఆధారంగా నేతల పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. 
 
సిట్ అధికారులు న‌యీమ్ అనుచ‌రుల‌ను, కేసులో సంబంధం ఉన్న వ్య‌క్తుల‌ను వరుసగా అదుపులోకి తీసుకుంటున్నారు. కాగా సోమవారం మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌కు చెందిన బ‌త్తుల ఈశ్వ‌ర‌య్యను సిట్ అధికారులు అరెస్టు చేశారు. రెండు, మూడు రోజుల్లో మ‌రిన్ని అరెస్టులు చేస్తామ‌ని ఈ సందర్భంగా అధికారులు మీడియాకు తెలిపారు. నయీమ్ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు 126 ఫిర్యాదులు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు జ‌రుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 93 మందిని అరెస్టు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments