Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో 399 పాజిటివ్ కేసులు.. వేగంగా విస్తరిస్తున్న కరోనా

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (15:46 IST)
హైదరాబాద్ నగరంలో రోజురోజుకీ కరోనా విజృంభిస్తోంది. హైదరాబాద్ పరిధిలో 399 పాజిటివ్‌ కేసులు నమోదైనాయి. ఈ కరోనా 20 మందిని పొట్టనబెట్టుకుంది. వెస్ట్ జోన్, సౌత్ జోన్లలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. వెస్ట్‌జోన్‌-138, సౌత్‌జోన్‌-170, సెంట్రల్ జోన్-45, ఈస్ట్‌జోన్‌లో 33 కేసులు నమోదవగా... నార్త్ జోన్‌లో 13 కేసులు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
 
ఇక ముంబైలో జర్నలిస్టులకు కరోనా సోకిందన్న వార్తలు విని కలత చెందాను అని మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత మంగళవారం ట్వీట్‌ చేశారు. జర్నలిస్టులకు కరోనా సోకడం దురదృష్టకరమన్నారు. 'మీడియా మిత్రులు కరోనా నియంత్రణలో ముందుండి పోరాటం చేస్తున్నారు. వార్తలు సేకరించే సమయంలో తమను, తమ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవాలి' అంటూ కవిత అభ్యర్థిస్తూ ట్వీట్‌ చేశారు.
 
మరోవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చేతనైన సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు స్వీకరించారు. సిద్ధిపేటకు చెందిన ప్రముఖ కళింగ బ్రీడ్స్ ఫార్మర్ పరిశ్రమ ప్రతినిధి కే. సురేందర్ రెడ్డి రూ.5 లక్షల రూపాయల విరాళం అందించినట్లు మంత్రి వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు స్ఫూర్తి సూర్య నే : ఎస్ఎస్ రాజమౌళి - అవకాశం మిస్ చేసుకున్నా: సూర్య

షూటింగులో గాయపడిన సునీల్ శెట్టి...

ధర్మం కోసం జితేందర్ రెడ్డి ఏం చేశాడు.. రివ్యూ

మట్కా లో అదే నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది : జివి ప్రకాష్ కుమార్

ఐఫా వేడుకల్లో తేజ సజ్జా - రానా కామెంట్స్.. సారీ చెప్పాలంటూ మహేశ్ ఫ్యాన్స్ డిమాండ్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments