Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ప్రమాణ స్వీకారోత్సవం.. రానున్న కేసీఆర్.. చంద్రబాబు వస్తారా?

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (14:24 IST)
వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 30న విజయవాడలో జగన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి అతిరథమహారథులు వస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారని సమాచారం. 
 
వైఎస్ జగన్‌తో కేసీఆర్‌కి ఎలాంటి విభేదాలు లేవు. కానీ మున్ముందు ఎలాంటి సమస్యలూ రాకూడదని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సంప్రదాయబద్ధంగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా కేసీఆర్‌ను పిలిచారు. ఈ పిలుపు ద్వారా తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వైరుధ్యాలకు జగన్ ప్రమాణ స్వీకారోత్సవం చెక్ పెట్టే ఛాన్సుందని విశ్లేషకులు అంటున్నారు.  
 
ఇక జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ ఆహ్వానానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిసింది. ఇదివరకు టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి భూమిపూజకు కేసీఆర్‌ను ఆహ్వానించారు. కొన్ని అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలున్నా.. చంద్రబాబుతో కొన్ని కార్యక్రమాలకు కేసీఆర్ హాజరయ్యారు. 
 
కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రధానంగా చంద్రబాబు తెలంగాణలో పోటీ చేయడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారు. అయితే ఆ ఎన్నికల్లో ప్రజాకూటమి ఓడిపోవడంతో కేసీఆర్ పైచేయి సాధించినట్లైంది. అప్పట్లో చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్, తాజాగా చంద్రబాబు ఓడిపోవడంతో మాట నెగ్గించుకున్నట్లైంది.
 
ఇక ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని తెలుస్తోంది. ఏపీకి సీఎం కానున్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును ఆహ్వానిస్తారని తెలుస్తోంది. అలా జగన్ ఆహ్వానానికి చంద్రబాబు సానుకూలంగా స్పందించి.. ప్రమాణ స్వీకారానికి హాజరవుతారో లేదో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments