Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్యాన్ ప్రభంజనం.. బై బై బాబూ.. కుప్పంలో వెనకబడిన చంద్రుడు

Advertiesment
ఫ్యాన్ ప్రభంజనం.. బై బై బాబూ.. కుప్పంలో వెనకబడిన చంద్రుడు
, గురువారం, 23 మే 2019 (10:12 IST)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో.. ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తోంది. టీడీపీ మెజార్టీ తగ్గిపోతోంది. 175 స్థానాలకు గాను 135 స్థానాల్లో ఫ్యాన్ గుర్తు సునామీ సృష్టించింది. ఇక తెలుగుదేశం పార్టీకి 22 స్థానాలే దక్కాయి. 
 
ముఖ్యంగా కుప్పంలో సీఎం చంద్రబాబు వెనుకబడ్డారు. కౌంటింగ్‌ రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి ఆయన వెనుకంజలో ఉన్నారు. అక్కడ వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి 357 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక 110 స్థానాల్లో వైసీపీ లీడింగ్‌లోకి వచ్చింది. టీడీపీ 25 సీట్లలో ముందంజలో ఉంది. మరోవైపు, మంగళగిరిలో లోకేశ్ వెనుకంజలో ఉన్నారు. లోక్‌సభ విషయానికి వస్తే వైసీపీ 11 స్థానాల్లో లీడ్‌లో ఉండగా, 5 స్థానాల్లో టీడీపీ ఉంది.
 
ఇక తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అంతా ఊహించినట్టుగానే టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్, మరికొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు టీఆర్ఎస్‌కు పోటీ ఇస్తున్నారు.
 
కరీంనగర్, మహబూబ్ నగర్ లాంటి స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు టీఆర్ఎస్‌కు పోటీ ఇస్తుండగా... మల్కాజ్ గిరి, నల్లగొండ, చేవెళ్ల వంటి చోట కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంది. 
 
మొత్తం 17లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్ 12 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా... హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో ఎంఐఎంపై బీజేపీ అభ్యర్థి ముందుంజలో ఉన్నారు. ఫలితాల ఇదే రకంగా కొనసాగితే తెలంగాణలో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశ్వసనీయత కోల్పోయిన 'ఆంధ్రా ఆక్టోపస్' లగడపాటి సర్వే