Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు- ప్రజలు అప్రమత్తంగా వుండాలి.. ఐఎండీ హెచ్చరిక

సెల్వి
సోమవారం, 21 జులై 2025 (16:29 IST)
Rains
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుందని, వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో  వచ్చే ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. 
 
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇందులో భాగంగా ఏపీలో తిరుపతి, కడప, అనంతపురం, కృష్ణా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
 
తెలంగాణలో ములుగు, ఖమ్మం, ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments