Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి అతివేగం పది మంది ప్రాణాలు తీసింది... ఖమ్మంలో ఘోరం

అర్థరాత్రి అతివేగం 10 పంది ప్రాణాలు తీసింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఖమ్మం జిల్లాలో జరిగింది. ఆదివారం అర్థరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కుసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద అదుపుతప్పి ప్రైవేట్ బస్సు కాలువల

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2016 (17:01 IST)
అర్థరాత్రి అతివేగం 10 పంది ప్రాణాలు తీసింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఖమ్మం జిల్లాలో జరిగింది. ఆదివారం అర్థరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కుసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద అదుపుతప్పి ప్రైవేట్ బస్సు కాలువలో పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులంతా కాకినాడ వాసులుగా గుర్తించారు. 
 
హైదరాబాద్‌ నుంచి ఆదివారం రాత్రి 11.30 గంటలకు బయలుదేరిన యాత్రాజినీ బస్సు 2.30 ప్రమాదానికి గురైంది. నాయకన్‌గూడెం వద్దకు చేరుకోగానే ప్రైవేటు బస్సు అదుపుతప్పి నాగార్జునసాగర్‌ ఎడమకాలువ వంతెనపై నుంచి బోల్తాపడింది. అతివేగం, డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు చెబుతున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే డ్రైవర్ మాత్రం ప్రమాదం జరిగిన వెంటనే పారిపోయాడని పోలీసులు చెబుతున్నారు.
 
ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని దుర్గారావ్, సుబ్బారెడ్డి, వానపల్లి రాజు, శ్రావణి (18), ప్రశాంత్ (22), విజయ, అజారిద్దిన్, మోక్ష, లక్ష్మి, అశోక్‌లుగా గుర్తించారు. అలాగే, క్షతగాత్రుల్లో సత్యనారాయణ, బాలకృష్ణ, ధనలక్ష్మి, భాస్కర్‌రావు, లక్ష్మణ సతీశ్‌, ఫణి, వెంకటేశ్వర్లు, ప్రేమకుమారి, సూర్యకుమారి, నాగమణి, వెంకటసూర్యసాయి, లక్ష్మీమణి, గణేశ్‌లు ఉన్నారు. క్షతగాత్రులంతా ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments