Pawan Kalyan in Kadapa: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం నాడు కడప మునిసిపల్ హైస్కూలు విద్యార్థినీవిద్యార్థులతో ముచ్చటించారు. వారి సమస్యలను విన్నారు. అలాగే ఉపాధ్యాయుల చెప్పిన సమస్యలకు తక్షణ పరిష్కాలకు ఆదేశాలు జారీ చేసారు. మునిసిపల్ హైస్కూలులో కిచెన్ కోసం తన సొంద నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు.
అనంతరం అధ్యాపకులు, విద్యార్థినీవిద్యార్థులతో మాట్లాడుతూ... మన ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరుముగ్గురు పిల్లలని సముదాయించేందుకే ఎంతో కష్టపడిపోతుంటారు. అలాంటిది ఒక క్లాసుకి 30 మంది విద్యార్థినీవిద్యార్థులను కూర్చోబెట్టి వారికి పాఠాలను బోధించడం మాటలు కాదు. అధ్యాపకులు ఎంతో కష్టపడుతుంటారు. వారి కష్టానికి ప్రతిఫలంగా దేశంలోనే అత్యధిక జీతం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.