Webdunia - Bharat's app for daily news and videos

Install App

టవర్‌పై నుంచి జారిపడి బాలుడు మృతి - రూ.2624 కోట్ల అపరాధం

ఠాగూర్
శనివారం, 7 డిశెంబరు 2024 (17:22 IST)
పార్కులో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఓ బాలుడు భారీ టవర్‌పై నుంచి కిందపడటంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో జాయ్ రైడ్ కంపెనీకి కోర్టు రూ.2624 కోట్ల అపరాధం విధించింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో చోటుచేసుకుంది. 
 
ఓర్లాండోలోని ఐకాన్ పార్క్‌కు స్థానిక స్కూలుకు చెందిన ఫుట్ బాల్ టీమ్ సభ్యులు వెళ్లారు. పిల్లలంతా అక్కడి రైడ్‌లను ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే టైర్ శాంసన్ (14) అనే బాలుడు ఫ్రీ పాల్ రైడ్ ఎక్కాడు. నిబంధనల ప్రకారం 129 కిలోల లోపు బరువున్న వారినే రైడ్ ఎక్కేందుకు అనుమతించాలి. సాంప్సన్ మాత్రం 173 కిలోల బరువున్నాడు. అయినప్పటికీ నిర్వాహుకులు అతడిని రైడ్‌కు అనుమతించారు. శాంసన్ లావుగా ఉండడంతో సీటు బెల్ట్ సరిగా ఫిట్ కాలేదు.
 
దీంతో టవర్ పైకి వెళ్లాక అది ఊడిపోయి శాంసన్ కిందపడి చనిపోయాడు. దీనిపై శాంసన్ తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. పార్క్ నిర్వాహకులతో పాటు ఫ్రీ పాల్ తయారీదారుల నిర్లక్ష్యం ఉందని కోర్టు నిర్ధారించింది. నిర్వాహకులు, తయారీదారులలో జవాబుదారీతనం తీసుకురావాలనే ఉద్దేశంతో శాంసన్ తల్లిదండ్రులకు భారీ మొత్తంలో పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది. ఈ ప్రమాదంలో జాయ్ రైడ్ తయారీ సంస్థతో పాటు నిర్వాహకుల నిర్లక్ష్యం ఉందని నిర్ధారించిన కోర్టు భారీ జరిమానా విధించింది. మరణించిన బాలుడి తల్లిదండ్రులకు 310 మిలియన్ డాలర్లు (రూ.2,624 కోట్లు) చెల్లించాలంటూ తీర్పు చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకుల్లో క్లారిటీ లేకే వేస్టేజ్ వస్తుంది : ఫియర్ డైరెక్టర్ డా. హరిత గోగినేని

పుష్ప లో హీరోది కూలీ క్యారెక్టర్. బచ్చల మల్లి ట్రాక్టర్ డ్రైవర్ : డైరెక్టర్ సుబ్బు మంగాదేవి

ఏపి ఫైబర్‌నెట్‌ రవివర్మపై నాపై వచ్చిన ఆరోపణలపై కేసు పెడతా : రామ్ గోపాల్ వర్మ

రాజమౌళి సినిమాలో హీరోగా, సందీప్ వంగా సినిమాలో విలన్‌గా నేనే చేస్తా : బాలకృష్ణ

మేఘన, నీల్ క్రితన్ పాడిన ఫియర్ టైటిల్ సాంగ్ ఆవిష్కరించిన రాఘవ లారెన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Boiled Moong Dal ఉడికించిన పెసలు తింటే?

కాఫీ, టీ యొక్క 8 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

రక్తంలో చక్కెరను తగ్గించే 5 సూపర్ ఫుడ్స్, ఏంటవి?

kidney stones, కిడ్నీల్లో రాళ్లు రాకుండా ఏం చేయాలి?

Hair fall control tips ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది

తర్వాతి కథనం
Show comments